రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ ని వివాదాలు వీడడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో 3D లో తెరకెక్కిన ఆదిపురుష్ లోని డైలాగ్స్, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, రాఘవుడిగా ప్రభాస్ లుక్స్, సైఫ్ అలీ ఖాన్ రావణుడి లుక్ ఇలా ప్రతిదాన్ని వదలకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. ఆదిపురుష్ మొదలు పెట్టినప్పుడు రామాయణం ఆధారంగా తెరకెక్కించింది అని.. నెగెటివ్ టాక్ వచ్చాక ఇప్పుడు ఆదిపురుష్ ని కేవలం ప్రేరణగా తీసుకొని మాత్రమే చేసింది అని మేకర్స్ అంటున్నారు.
మొదటి రోజు ఆదిపురుష్ పై అంచనాలతో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తర్వాత శనిఆదివారాల్లోనూ మంచి కలెక్షన్స్ కొల్లగొడుట్టింది. ఆదిపురుష్ పై రోజుకో వివాదం ముసురుతుంది. ఇప్పటికే నేపాల్ దేశంలో ఖాట్మండు లాంటి ప్రదేశాల్లో ఆదిపురుష్ పై బ్యాన్ విధించారు. ఇప్పుడు మరో కాంట్రవర్సీ మొదలైంది. ఈసారి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ఆదిపురుష్ ని బ్యాన్ చేయాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అసలు మా రామాయణం కాదని, రామున్ని, హనుమంతుణ్ణి అవమానిస్తూ ఈ సినిమా చేసారని ఈ చిత్రాన్ని థియేటర్స్ లో నిషేధం విధించాలంటూ వారి నానా గోల చేస్తున్నారు.
ఆదిపురుష్ స్క్రీన్ ప్లే, డైలాగ్‌లు రాముడు, హనుమంతుని కించపరిచేలా ఉన్నాయి. ఈ చిత్రం హిందువుల మతపరమైన సెంటిమెంట్లను, సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది.. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్స్ లోనే కాదు ఓటిటి లో కూడా బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చెయ్యడంతో పాటుగా ఈ అంశాన్ని ప్రధాని మోదీ వరకు తీసుకువెళ్లారు.