సెప్టెంబర్ 28 ప్రభాస్ ఫాన్స్ కి బిగ్ డే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ విడుదల కాబోయే రోజు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీపై భారీగా అంచనాలున్నాయి. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నాడు. శృతి హాసన్ తో పాటుగా జగపతి బాబు లాంటి క్రేజీ నటులు భాగమవుతున్నారు. ఇప్పటికే లీకైన చిత్రాలు, మేకర్స్ వదిలిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు, హైప్ క్రియేట్ చేసేవిలా ఉన్నాయి.
అయితే సలార్ టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. జులై మొదటి వారంలో సలార్ టీజర్ ఉండొచ్చనే ఊహాగానాల నడుమ.. తాజాగా సమాచారం ప్రకారం ఆదిపురుష్ హడావిడి తగ్గేవరకు సలార్ టీజర్ విడుదల చెయ్యరని తెలుస్తుంది. ఒకవేళ తొందరపడి సలార్ టీజర్ వదిలితే ఆదిపురుష్ పై ఉన్న కాస్త ఇంప్రెషన్ పోతుంది. ఆదిపురుష్ వసూళ్లు పడిపోతాయి.. ప్రభాస్ ని మాస్ గా చూసిన ఫాన్స్ ఆదిపురుష్ ని పట్టించుకోరు, అందుకే ఆదిపురుష్ వసూళ్లు తగ్గాకే సలార్ టీజర్ ని విడుదల చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట.
ఇక ఈరోజు ఉన్నట్టుండి సలార్ నుండి బిగ్గెట్స్ అప్ డేట్ వచ్చేసింది. సలార్ విడుదలకి ఇంకా 100 రోజులు మాత్రమే ఉన్నాయంటూ పోస్టర్ వేసి మరీ గుర్తు చేసారు. ఆదిపురుష్ రిజల్ట్ తో డిస్పాయింట్ అయిన ప్రభాస్ ఫాన్స్ మూడు నెలల్లో రాబోయే సలార్ పై చాలా నమ్మకమే పెట్టుకున్నారు.