Advertisementt

మళ్ళీ పెళ్ళికి ఓటిటీ ముహూర్తం కుదిరింది

Tue 20th Jun 2023 02:54 PM
malli pelli  మళ్ళీ పెళ్ళికి ఓటిటీ ముహూర్తం కుదిరింది
Malli Pelli streaming date locked మళ్ళీ పెళ్ళికి ఓటిటీ ముహూర్తం కుదిరింది
Advertisement
Ads by CJ

సీనియర్ హీరో నరేష్-పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి మూవీ గత నెలలోనే థియేటర్స్ లో విడుదలైంది. నరేష్ తన మూడో భార్య తో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో, పవిత్ర లోకేష్ తన భర్త తో ఎంతగా సతమతమయ్యిందో.. వీరిద్దరిని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఏ విధంగా టార్గెట్ చేసిందో అనేది మొత్తం మళ్ళీ పెళ్లి సినిమా రూపంలో ప్రెజెంట్ చేసారు. అయితే ఇది సినిమాగా తెరకెక్కించడమెందుకు ప్రెస్ మీట్ పెట్టి చెబితే సరిపోతుంది అంటూ చాలామంది పెదవి విరిచారు. 

నరేష్-పవిత్ర లోకేష్ లు మళ్ళీ పెళ్లి ప్రమోషన్స్ లో రొమాన్స్ లతో చెలరేగిపోయారు. డాన్స్ లో చిర్రెత్తుకొచ్చేలా చేసారు. అలంటి ప్రమోషన్స్ తోనే సినిమాపై కాస్త అంచనాలు పెంచారు. కానీ నరేష్-పవిత్ర ఇద్దరూ మళ్ళీ పెళ్లితో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు.

థియేటర్స్ లో మళ్ళీ పెళ్ళికి కనీసం యావరేజ్ కలెక్షన్స్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఓటిటీ స్ట్రీమింగ్ కి ముహూర్తం కుదిరింది. అమెజాన్ ప్రైమ్ మళ్ళీ పెళ్లి హక్కులని చేజిక్కించుకుంది. మళ్ళీ పెళ్లి ఈనెల 23 అంటే మరో మూడు రోజుల్లోనే ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. జూన్ 23 శుక్రవారం మళ్ళీ పెళ్లి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. మరి థియేటర్స్ లో మిస్ అయిన వారు మళ్ళీ పెళ్లిని ఓటిటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.

Malli Pelli streaming date locked:

 Malli Pelli Movie On Ott 

Tags:   MALLI PELLI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ