Advertisementt

మనవరాలు పుట్టిందంటూ మెగాస్టార్ అనందం

Tue 20th Jun 2023 01:18 PM
megastar chiranjeevi  మనవరాలు పుట్టిందంటూ మెగాస్టార్ అనందం
Chiranjeevi expressed happiness on the birth of a granddaughter మనవరాలు పుట్టిందంటూ మెగాస్టార్ అనందం
Advertisement
Ads by CJ

ఈరోజు జూన్ 20 మంగళవారం మెగాస్టార్ ఇంటికి మహాలక్ష్మి అడుగుపెట్టేసింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు. నిన్న సాయంత్రమే మెగాస్టార్ చిరు కోడలు, రామ్ చరణ్ వైఫ్, కామినేని ఆడపడుచు ఉపాసన డెలివరీ కోసం అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆమె వెంట అత్త సురేఖ, భర్త చరణ్, తల్లి శోభనలు రాగా ఈ రోజు తెల్లవారేసరికి మెగా ఫ్యామిలీకి శుభవార్త అందింది. లిటిల్ ప్రిన్స్ అంటే మెగా ప్రిన్స్ పుట్టినట్లుగా గుడ్ న్యూస్ వినిపించారు. మెగాస్టార్ ఈరోజు ఉదయమే అపోలో ఆసుపత్రికి చేరుకొని మనవరాలిని చూసి మురిసిపోయారు.

తదుపరి ఆయన మీడియాతో మట్లాడుతూ..

ఉదయం 1:49 కి పాప పుట్టింది..

మాకెంతో ఇష్టమైన  మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం..

మంచి ఘడియల్లో పుట్టిందని , పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందంటున్నారు..

ఆ ప్రభావం‌ ముందునుంచి మా కుటుంబంలో కనబడుతుంది.‌

చరణ్ కెరీర్ లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్ మెంట్ ఇలా మా ఫ్యామిలీ లో అన్నీ శూభాలే జరుగుతున్నాయి..

అంటూ మెగాస్టార్ అనందంగా మీడియాతో ముచ్చటించారు. స్వతహాగా మెగాస్టార్ ఆంజనేయస్వామి భక్తుడు. ఆయనకి మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆరోజే మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకే ఇంత సంతోషపడిపోతున్నారు.

Chiranjeevi expressed happiness on the birth of a granddaughter:

Birth of granddaughter priceless: Megastar Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ