మెగా ఫ్యామిలీలో సెలెబ్రేషన్స్ కి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మెగా కోడలు ఉపాసనకు డెలివరీకి సమయం ఆసన్నమైంది. రేపే అంటే జూన్ 20 నే రామ్ చరణ్ కి బాబో.. పాపో పుట్టబోతున్నారు. మెగా వారసుడి రాక కోసం మెగా ఫ్యామిలీ ఎదురు చూపులకి ఫలితం దక్కబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ శుభవార్త వినేందుకు మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. అందరూ సిద్ధమవుతున్నారు. ఉపాసన డెలివరీ కోసం అపోలో ఆసుపత్రికి వెళ్ళింది. ఉపాసన ప్రసవం కోసం ఆసుపత్రికి వెళుతున్నప్పుడు భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఉపాసన మదర్ శోభన కామినేని ఉపాసన వెంట వెళుతున్న వీడియో సామాజిమ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మరి రేపు మంచి సమయంలో ఉపాసన డెలివరీకి అపోలో ఆసుపత్రి డాక్టర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా.. ఉపాసన అంత హెల్దీగా ఆసుపత్రికి నడిచి వెళ్లడంపై మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెల్దీగా డెలివరీ అయ్యి పండండి బిడ్డని చరణ్ ఎత్తుకోబోతున్న మధుర క్షణాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక సోషల్ మీడియా టాక్ ప్రకారం ఉపాసన ఆడపిల్లకి జన్మనివ్వబోతోంది అని చెబుతుండగా.. మెగా అభిమానులు మాత్రం మెగా వారసుడు రాబోతున్నాడనే ఊహల్లో తేలిపోతున్నారు.
రేపు ఈ సమయానికి మెగాస్టార్ మనవరాలిని ఎత్తుకుని ముద్దాడుతారో.. లేదంటే మనవడిని ఎత్తుకుని మురిసిపోతారో అనేది తెలిసిపోతుంది. జస్ట్ కొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు.. మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలు కావడానికి.