పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బాగా బిజీగా కనిపిస్తున్నారు. వారాహి యాత్ర అంటూ అక్కడి జగన్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ కి వణికిపోతున్న వైసిపీ మంత్రులు వరసగా మీడియా లో పవన్ పై ఫైర్ అవుతున్నారు. పవన్ కూడా గ్యాప్ ఇవ్వకుండా వైసిపి వాళ్ళని ఆడుకుంటున్నారు. వారాహి యాత్రలో జోష్ మీదున్న పవన్ కళ్యాణ్ తన తోటి ఆర్టిస్ట్ లంటే గౌరవం, వాళ్ళ సినిమాలు చూస్తాను నాకు చిరు, తారక్, రామ్ చరణ్, ప్రభాస్ అంటే చాలా ఇష్టమని మొన్న మాట్లాడారు.
అయితే అప్పుడు ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు చెప్పడం పవన్ మర్చిపోవడంతో పవన్ పై అల్లు ఫాన్స్ సీరియస్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ మనసులో ఏదో పెట్టుకునే అల్లు అర్జున్ పేరు చెప్పలేదు అంటూ వారు తెగ బాధపడుతున్నారు. అయితే ఈరోజు కాకినాడలో మాట్లాడుతూ తనకి మహేష్ బాబు, ప్రభాస్ తారక్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ , చిరంజీవి గార్లు, ఇతర హీరోల అభిమానులకు ఒక్కటే చెప్తున్నాను. వారందరూ నాకు ఇష్టమే, మేమంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, భవిష్యత్తు కోసం అడుగెయ్యండి అని ఇండస్ట్రీ సపోర్ట్ జనసేనకు కావాలంటూ ఆయన ఓపెన్ గానే అడిగేసారు.
ఇతర హీరోలతో పవన్ కళ్యాణ్ స్నేహంతోనే ఉంటారు. వారి అభిమానులంతా కలిస్తే పవన్ కళ్యాణ్ జనసేనకు భారీ సపోర్ట్ రావడం పక్కనే. కానీ జనసేనకు పవన్ ఫాన్స్ సపోర్ట్ లేదనే మాట ఉంది. ఇప్పుడు ఇతర హీరోల ఫాన్స్ జనసేనకు ఏ మాత్రం సపోర్ట్ చేస్తారో చూడాలి.