Advertisementt

మెగా చిన్న కోడలు లావణ్య న్యూ లుక్

Mon 19th Jun 2023 08:05 PM
lavanya tripathi new look  మెగా చిన్న కోడలు లావణ్య న్యూ లుక్
Mega Chinna Kodalu Lavanya New Look మెగా చిన్న కోడలు లావణ్య న్యూ లుక్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీలో రెడోతరంలో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మెగా ఫ్యామిలీ బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వర్తిస్తుంటే.. ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలోకి చిన్న కోడలు అడుగుపెట్టబోతుంది. అదే నాగబాబు కొడుకు, హీరో వరుణ్ తేజ్ భార్యగా మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టేందుకు లావణ్య త్రిపాఠి సిద్ధమైంది. రీసెంట్ గానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ నాగబాబు ఇంట్లోనే మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబాల మధ్యన సింపుల్ గా జరిగిపోయాయి. అయితే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రోజున కేవలం మెగా ఫ్యామిలీ పిక్స్ మాత్రమే బయటికి వచ్చాయి.

కానీ లావణ్య త్రిపాఠి పేరెంట్స్ పిక్స్ బయటికి రాలేదు. అయితే ఫాథర్స్ డే సందర్భగా లావణ్య తన పేరెంట్స్ తో కలిసి పూజ చేస్తున్న పిక్ వదిలింది. అది కూడా వరుణ్ తో తన నిశ్సితార్ధం రోజున లావణ్య తన తల్లితండ్రులతో కలిసి ఉంగరాలు మార్చుకునే ముందు చేసిన పిక్ అది. ఆ పూజ తర్వాతే లావణ్య శారీ మార్చుకుని వరుణ్ తేజ్ తో ఉంగరం తొడిగించుకుంది. ఆ శారీ లో లావణ్య వెలిగిపోయింది. అయితే లేటెస్ట్ గా లావణ్య త్రిపాఠి మరో లుక్ అంటే ఎంగేజ్మెంట్ జరగకముందు పిక్ వదిలింది.

ఆ పిక్ లో లావణ్య మెరిసిపోయింది. ఆరెంజ్ కలర్ గోల్డ్ టిష్యు శారీ లో మీద నిండా బంగారు ఆభరణాలతో ముక్కుకు ముక్కెరతో లావణ్య త్రిపాఠి బ్రైడల్ లుక్ లో మెరిసిపోయింది. వరుణ్ తేజ్ తో రింగ్స్ తొడిగించుకున్న తర్వాత ఆలివ్ గ్రీన్ శారీ లో అదరగొట్టేసింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి న్యూ ఆరెంజ్ కలర్ శారీ లుక్ వైరల్ అయ్యింది. 

Mega Chinna Kodalu Lavanya New Look:

Lavanya Tripathi New Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ