మెగాస్టార్ ఇంటికి మెగా వారసుడి రాక కన్ ఫర్మ్ అయ్యిందా అంటే అవుననే అంటుంది సోషల్ మీడియా. రామ్ చరణ్-ఉపాసనలు తల్లితండ్రులవుతున్నారు అన్నప్పటినుండి మెగా ఫ్యామిలీ ఎంత సంతోషంగా వారసుడి రాక కోసం వెయిట్ చేస్తుందో.. అంతే ఆతృతగా మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి పుట్టబోయేది మగ బిడ్డా.. ఆడబిడ్డా అనే విషయంలోనూ చాలా క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జులై మొదటి వారంలోనే ఉపాసన డెలివరీ డ్యూ డేట్ అంటూ ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మాత్రం రేపే ఉపాసన డెలివరీ అంటూ మరో న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఉపాసన రేపు అంటే మంగళవారం బిడ్డకి జన్మనివ్వబోతోంది, మెగా ఫ్యామిలికి జూన్ 20 స్పెషల్ డే.. రేపు మెగా వారసుడు దిగబోతున్నాడంటూ, రామ్ చరణ్-ఉపాసన దంపతులు పేరెంట్స్ గా మారబోతున్నారంటూ, రేపే రామ్ చరణ్-ఉపాసనలు తమ బిడ్డకి స్వాగతం చెప్పబోతున్నారంటూ.. ఆ వార్తల సారాంశం. A big day tomorrow in Mega family ❤ అంటూ వారికి అప్పుడే బెస్ట్ విషెస్ చెప్పడం మొదలు పెట్టేసారు. మరి నిజంగానే రేపు జూన్ 20 న ఉపాసన ప్రసవించబోతుందా.. లేదా ఇది ఫేక్ న్యూసా అనేది తెలియాల్సి ఉంది.
కానీ మెగా ఫాన్స్ మాత్రం రేపే మెగా వారసుడు మెగాస్టార్ చిరు ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాడని వారు సంబరాలు మొదలు పెట్టేసారు. మరి మెగాస్టార్ చిరు కి మనవడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కొడుకు అంటే మెగా ఫాన్స్ ఆగుతారా.. ఇలానే పండగ చేసుకుంటారు.