అనసూయ భరద్వాజ్ ఈమధ్యన రోజూ వార్తల్లో నిలుస్తుంది. భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్ బీచ్ లో గ్లామర్ గా ఎక్కువ అతి చేసిన అనసూయ.. మరోపక్క విజయ్ దేవరకొండతో వివాదాన్ని వదిలించుకోవాలని చూస్తుంది. కానీ అది అనసూయని మరింతగా ట్రోల్ చేసేలా చేస్తుంది. కారణం తాను విజయ్ దేవరకొండతో ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను, నాపై విజయ్ సన్నిహితుల్లో ఒకరు డబ్బులిచ్చి ట్రోల్ చేయించడం బాధాకరం అంటూ ఆ గొడవని ఆపేస్తున్నట్లుగా ప్రకటిస్తూనే కాంట్రవర్సీకి తెర లేపింది. కానీ మరోసారి అనసూయ ఈ వివాదంపై ట్వీట్ చేసింది.
అందరికి నమస్కారం.. కొద్దిరోజులుగా నాపై నెగెటివ్ గా చాలా ట్వీట్స్ వస్తున్నాయి. పొలిటికల్ గా, ఎటెర్టైన్మెంట్ విషయంలోనూ నా పేరును వాడి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమర్యాదగా ఉంది. నన్ను నా పేరుని కించపరిచేలా చేస్తున్నారు. ఇది నా జీవితం, నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను. నా ఫ్యామిలీ జోలికి రావొద్దు. దీనితో నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఓ మహిళనే. నన్ను నమ్మండి. నాకు ఎలాంటి పీఆర్ టీం లేదు.
మీకు ఏది చెప్పాలన్నా నేనే చెప్తాను. నా విషయాలు నచ్చకపోతే నాకు దూరంగా ఉండండి. దయచేసి నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు అంటూ సోషల్ మీడియాలో స్పెషల్ గా ఓ నోట్ ని షేర్ చేసింది అనసూయ.