Advertisementt

ఎన్టీఆర్ దేవర కోసం భారీ సెట్

Mon 19th Jun 2023 02:10 PM
ntr,devara update  ఎన్టీఆర్ దేవర కోసం భారీ సెట్
Huge set for NTR Devara ఎన్టీఆర్ దేవర కోసం భారీ సెట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. చడీ చప్పుడు చెయ్యకుండా దేవర షూటింగ్ ని కొరటాల పక్కా ప్రణాళికలతో పూర్తి చేసేస్తున్నారు. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తవ్వాలనే టార్గెట్ తో ఎన్టీఆర్-కొరటాల ఉండడంతో గ్యాప్ లేకుండా దేవరని చుట్టేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తోనే అభిమానులని మెప్పించిన కొరటాల ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు తమ తమ షెడ్యూల్స్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ దేవరపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్-ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కోసం కొరటాల శివ స్పెషల్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో కళ్లు చెదిరిపోయేలా భారీ బడ్జెట్ తో ఓ సెట్ వేస్తున్నారు. ఈ భారీ సెట్ లోనే సైఫ్ అలీఖాన్-ఎన్టీఆర్ మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. 

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న  ఈ చిత్రంలో మణి చందన, చైత్ర రాయ్ లాంటి సీరియల్ నటులు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా పేరున్న నటులనే కొరటాల దేవర కోసం ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదలకాబోతున్నట్లుగా షూటింగ్ మొదలు పెట్టకముందే డేట్ లాక్ చేసి పెట్టేసారు. 

Huge set for NTR Devara:

NTR Devara update

Tags:   NTR, DEVARA UPDATE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ