రవితేజ ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్న హీరో. క్రాక్ తర్వాత ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ని ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ తర్వాత ఎలాగో శ్రీలీల లక్కు, ఆమె టాలెంట్ తో ధమాకాతో హిట్ కొట్టి 100 కోట్లని ఈజీగా కొల్లగొట్టాడు. మళ్ళీ రావణాసురతో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు తో అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మళ్ళీ నాలుగు నెలల గ్యాప్ తో ఈగల్ తో సంక్రాంతికి వస్తా అంటున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలని విడుదల చేస్తున్న రవితేజ కథలపై పట్టుకోల్పోతున్నాడనే కంప్లైంట్ ఉంది.
అయితే ఇప్పుడు క్రాక్ తో తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో, అలాగే ధమాకాతో తన పరువు నిలబెట్టిన శ్రీలీల తో కలిసి ఓ మూవీ కోసం రవితేజ రంగం సిద్ధం చేయుకుంటున్నాడని వినికిడి. బాలకృష్ణ తో వీరసింహారెడ్డి చేసిన గోపీచంద్ మలినేని ఆ తరవాత తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇప్పుడు వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మరోసారి రవితేజతో చేయబోతున్నాడట. ఆ మూవీలోనే శ్రీలీల ని హీరోయిన్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది.
అది కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే రవితేజ-గోపీచంద్-శ్రీలీల మూవీ ఉండబోతుందట. సో రవితేజ మళ్ళీ తనకి సక్సెస్ ఇచ్చిన గోపీచంద్, శ్రీలీల నే నమ్ముకుని కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాడు.