కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం టాప్ పొజిషన్ కి దగ్గరగా ఉన్న భామ. సక్సెస్, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజీగా దూసుకుపోతున్న లక్కీస్ట్ హీరోయిన్ రష్మిక మందన్న.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో బాగా బిజీగా గడుపుతున్న తార. పుష్ప ఫ్యాన్ ఇండియా ఫిలిం తో అన్ని భాషల ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్న రష్మిక డాన్స్ విషయంలో చెలరేగిపోతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న రష్మిక రీసెంట్ గానే రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ షూటింగ్ కంప్లీట్ చేసింది.
తెలుగులో భీష్మతో హిట్ కొట్టిన వెంకీ కుడుములు-నితిన్ తో ఓ మూవీ మొదలు పెట్టింది. తెలుగు, తమిళ్ లో బైలింగువల్ మూవీగా రైన్ బో చేస్తుంది. ఇంకా అల్లు అర్జున్ తో పుష్ప ద రూల్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది అయితే ఇలా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న రశ్మికని ఆమె మేనేజర్ మోసం చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక దగ్గర ఎంతోకాలంగా పని చేస్తున్న ఆమె మేజర్ రశ్మికకి తెలియకుండా 80 లక్షల రూపాయలు కాజేసాడని సమాచారం.
ఎంతో నమ్మకంగా పని చేసే అతను ఇలా దొంగతనం చేయడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలిగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై రష్మిక మాత్రం మౌనం పాటిస్తుంది. కారణం ఇలాంటివి చెబితే తనకే అవమానని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.