Advertisementt

భగవంత్ కేసరి.. కాజల్ లుక్కొచ్చింది

Thu 29th Jun 2023 03:57 PM
kajal aggarwal,first look,bhagavanth kesari  భగవంత్ కేసరి.. కాజల్ లుక్కొచ్చింది
Kajal Aggarwal Attractive Look In Bhagavanth Kesari Out భగవంత్ కేసరి.. కాజల్ లుక్కొచ్చింది
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. రీసెంట్‌గా బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌తో మరో బ్లాక్‌బస్టర్ పక్కా అనేలా.. బాలయ్యను అనిల్ రావిపూడి ప్రజంట్ చేశారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, బాలయ్య లుక్.. ఇలా టీజర్‌లోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులను ఆకర్షించింది.. అంచనాలు పెంచేసింది. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు (జూన్19) సందర్భంగా ‘భగవంత్ కేసరి’లోని కాజల్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. 

ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తోన్న శ్రీలీల లుక్‌ని కూడా ఇటీవల ఆమె పుట్టినరోజున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాజల్ వంతొచ్చింది. ‘భగవంత్ కేసరి’కి సంబంధించి విడుదల చేసిన కాజల్ లుక్‌లో.. ఆమె ఇందులో ఒక ప్రొఫెసర్‌గా నటిస్తుందనేది అర్థమవుతోంది. శారీలో హుందాగా కాజల్ అగర్వాల్ కనిపిస్తోంది. నవ్వుతూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోంది. కాజల్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ లుక్ సందర్భంగా మరోసారి భగవంత్ కేసరి ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన లుక్‌ని కూడా ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో రివీల్ చేశారు. ఇందులో రూలర్‌గా అర్జున్ రాంపాల్ డెడ్లీ రోల్‌లో కనిపించారు. యూనిక్ స్క్రిప్ట్‌‌తో సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు. విజయదశమి (దసరా)కి థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Kajal Aggarwal Attractive Look In Bhagavanth Kesari Out:

First Look Of Kajal Aggarwal From Bhagavanth Kesari

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ