Advertisementt

త్వరలోనే బిగ్‌బాస్ 7.. బాలయ్యేనా?

Thu 29th Jun 2023 03:01 PM
balakrishna,bigg boss,season 7,nagarjuna,bigg boss 7 contestants  త్వరలోనే బిగ్‌బాస్ 7.. బాలయ్యేనా?
Bigg Boss Telugu Season 7 Latest Update త్వరలోనే బిగ్‌బాస్ 7.. బాలయ్యేనా?
Advertisement
Ads by CJ

ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఇప్పుడు ఏడవ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. అతి త్వరలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 మొదలుకాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్స్‌ని నిర్వాహకులు సెలక్ట్ చేసినట్లుగా కొన్ని పేర్లు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. కంటెస్టెంట్స్ సరే.. ఈ సీజన్ హోస్ట్ ఎవరు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన 6 సీజన్స్‌లో మొదటి సీజన్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో ప్రారంభం కాగా, రెండవ సీజన్‌ను నాని నడిపించారు. మిగతా సీజన్స్ అన్నీ కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తూ వస్తున్నారు. 

అయితే సీజన్ 6 దారుణమైన టీఆర్పీని రాబట్టుకోవడంతో.. జనాలకి బిగ్‌బాస్‌పైన ఇంట్రస్ట్ పోయింది. బిగ్‌బాస్ అనగానే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? హోస్ట్ ఎవరు? అని అంతా సెర్చ్ చేసేవారు. కానీ సీజన్ 6 నడిచిన తీరు అందరికీ నీరసాన్ని తెప్పించడంతో.. ఇప్పుడు బిగ్‌బాస్ 7 విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగైనా.. బిగ్‌బాస్‌పై జనాలకి ఇంట్రస్ట్ పెంచాలని వారు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఆ ఆలోచనలో భాగంగా ఈసారి హోస్ట్‌ను మార్చడమే కాకుండా.. కాస్త కంటెస్టెంట్స్ విషయంలో కూడా సీరియస్‌గా దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆహాలో అన్‌స్టాపబుల్‌తో హిస్టరీని క్రియేట్ చేసిన నందమూరి నటసింహం బాలయ్యని ఈ సారి హోస్ట్‌గా తీసుకురావాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. యాంకర్ రష్మీ గౌతమ్, సింగర్ మంగ్లీ, బుల్లితెర కపుల్ అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, హీరోయిన్ మిత్రా శర్మ, ట్రాన్స్‌జెండర్ తన్మయి, సింగర్ మోహన భోగరాజు వంటి వారు ఈ సీజన్ 7లో సందడి చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Bigg Boss Telugu Season 7 Latest Update:

Balayya to Host Bigg Boss Telugu Season 7

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ