Advertisementt

ఇప్పుడు ‘రామాయణం’ కాదంటారేంటి?

Thu 29th Jun 2023 08:34 AM
prabhas,adipurush,trolling,om raut  ఇప్పుడు ‘రామాయణం’ కాదంటారేంటి?
Trolls Doubled on Prabhas Adipurush Movie ఇప్పుడు ‘రామాయణం’ కాదంటారేంటి?
Advertisement
Ads by CJ

శ్రీరాఘవుడిగా ప్రభాస్, జానకి‌గా కృతిసనన్, లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్, శేష్ (లక్ష్మణుడు), హనుమంతుడు.. ఇలా అందరి పేర్లు పెట్టి.. మొదటి నుంచి రామాయణ ఇతిహాసంలోని కొన్ని ఘట్టాలను చూపిస్తున్నామని చెబుతూ వచ్చి.., విడుదలకు ముందు ఈ సినిమా ప్రదర్శించబడే థియేటర్లలో ఒక సీటు హనుమంతుడి కోసం రిజర్వ్ చేయబడి ఉంటుందని ప్రచారం కల్పించి.. తీరా ఇప్పుడు మూవీ విడుదలై.. విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. మేము తీసింది రామాయణం కాదని అంటున్నారు ‘ఆదిపురుష్’ మేకర్స్. నిజమే మీరు తీసింది రామాయణం కాదని చూసిన వారందరికీ అర్థమవుతుంది కానీ.. ప్రచారం కోసం మీరు చేసిన పనులేంటి? ఇప్పుడు మీరు చెబుతున్నది ఏంటి? అని కొందరు నెటిజన్లు ఆదిపురుష్ మేకర్స్‌పై మండిపడుతున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రం.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు, మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకోగా.. అడ్వాన్స్ బుకింగ్స్, వీకెండ్ కావడంతో.. కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకెళుతోంది. అయినా కూడా సినిమాపై నెగిటివిటీ ఆగడం లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ అయితే.. ప్రభాస్‌పై బీభత్సంగా కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా సినిమాపై బాగా నెగిటివిటీ పెరిగిపోవడంతో.. మేకర్స్ కూడా మాట మారుస్తున్నారు. మేము తీసింది రామాయణం కాదు.. జస్ట్ స్ఫూర్తిగా తీసుకుని.. మాకు నచ్చినట్లుగా చేశామని అంటున్నారు. దీంతో ప్రేక్షకులకి, నెటిజన్లకి మరింతగా మండుతోంది. 

ఎందుకంటే మొదటి నుంచి రామయాణంలోని కొన్ని భాగాలను చూపిస్తున్నామని మేకర్స్ చెబుతూ వచ్చారు. అయోధ్యలో కొన్ని ఈవెంట్స్ నిర్వహించారు. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. జై శ్రీరామ్ అంటూ భారీగా సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు పిల్లల కోసం తీసిన వీడియో గేమ్‌లా ఉంది సినిమా అంటూ కామెంట్స్ పడుతుండటంతో స్ఫూర్తి అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి.. మేకర్స్ బతికిపోయారు. ముఖ్యంగా ఓంరౌత్‌ సేఫ్ అయ్యారు.. లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి ఆయన పరిస్థితి ‘ఓం రౌత్.. కమ్ టు మై రూమే’.

Trolls Doubled on Prabhas Adipurush Movie:

Audience Hurts with Adipurush Makers Statements 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ