శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంపై.. విదేశాల్లో ఉండే ఓ భారతీయ డాక్టర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరి ఇది ఆదిపురుష్‌పై ప్రేమతో రాశారో.. లేదంటే ఇదేం సినిమా నాయనో అని తలబాదుకుంటూ రాశారో.. సరదాగా మీరూ సదివేసేయండి..
శవపరీక్ష
నేను వడివడిగాక్లినిక్ వైవు నడుచుకుంటూ పోతున్నాను,
‘డా శ్రీకాంత్, ఒక్క నిమిషం!’ వెనకనుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న జూనియర్ డాక్టర్ పిలుస్తున్నాడు.
నేను ఏంటి విషయం అన్నట్లు ఒక చూపు విసిరా, ‘చెప్పు రవి’ అని అనొచ్చు కానీ, సీనియర్ డాక్టర్ కాబట్టి, ఎంత తక్కువ మాట్లాడితే అంత స్థితప్రజ్ఞత, అంతే అనుభవం ఉన్నట్లు లెక్క.
‘నాదో సందేహం’ అన్నాడు.
‘గో ఆన్’ అంటూ నడుచుకుంటూ వెళ్తున్నా కారిడార్లో, నాతో పాటే నా వేగాన్ని అందుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు డా రవి.
‘ఇప్పుడే ఒక కేస్ చూసాను, నాక్కొంచెం మేనేజ్మెంట్ ప్లాన్‌లో మీ సహాయం కావాలి’’.
‘ఒకే, ప్రెసెంట్ ది కేస్’..
‘‘అతనికి ముప్ఫయిఐదేళ్లు ఉంటాయి, అప్పుడెప్పుడో పెళ్ళిచూపులకెళ్లాడట, ఆవిడ ఇతన్ని వద్దంది, ఇతను అందరి ముందు అవమాన పడ్డాడు. ఆ తరువాత ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. అంతవరకూ బాగానే ఉంది.’’
‘సరే తరువాత ఏమైంది?’
‘ఇతన్ని వద్దన్నావిడ ఇంకో మంచోడ్ని చూసి చేసుకుంది, కానీ వాళ్ళింట్లో ఏవోగొడవలట, దాంతో ఆవిడ వాళ్ళాయనతోపాటు బయటకు వచ్చేసింది.’
‘సరే ఇతని కేసులో ఆవిడ హిస్టరీ ఎందుకు?’
‘ఉండండి, అక్కడికే వస్తున్నా, హిస్టరీ అప్రస్తుతం కాదు, వెరీ మచ్ రిలవెంటు...’
‘కంటిన్యూ ..’
‘వాళ్ళాయన ఈవిడ అడిగిందేదో తేవటానికి బయటికెళ్లినప్పుడు, ఇతడెళ్ళి ఆమె పై మత్తు మందు జల్లి లేపుకొచ్చేసాడు, వీళ్ళింటి పెరట్లో ఆవిడ్ని కట్టేశాడు.’
‘ఈ యాంటీ సోషల్ గాళ్ళతో, నార్సిస్టిక్ గాళ్ళతో ఇదే ఇబ్బంది, సమాజంలో నేరాలన్నిటికి వీళ్ళే బాధ్యులు, ఇంతకీ ఆవిడ రెస్క్యూ అయ్యిందా? అయినా ఇప్పుడు వీడి చీఫ్ కంప్లైంట్ ఏంటి? వీడి అవమానానికి మందేంటి అనా? ఏం నీకు తెలీదా పెర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కిమందులుండవు, వీలైతే సైకోథెరపీ మాత్రమే నని అది కూడా వాళ్ళు సహకరిస్తే లేదా వాళ్లు చేసే నేరాలకి శిక్ష వెయ్యటమే, కొన్నిసార్లు మరణశిక్ష తప్పదు, అది మన పరిధిలో లేదు.’
‘వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్పాడట, అదలా పక్కన పెడితే, ఇతనో చిత్రమైన సందేహంతో మన అవుట్ పేషేంట్ విభాగానికొచ్చాడు.’
‘ఏంటది ?!’ నాలో ఒక అసహనంతో కూడిన ఉత్సుకత.
‘ఇప్పుడు ఇతను కిడ్నాప్ చేసినావిడ, ఇతనితో మాట్లాడటం లేదట. ఇతనేమో ఆవిడని లొంగదీసుకోవటానికి మందేమీ లేదా !?’ అని అడుగుతున్నాడు.
‘డా రవి, మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా! ఇటువంటి వాళ్ళతోమాట్లాడి మీసమయం, నా సమయం వృధా చేస్తారా? చూట్టానికి ఇంకెవరూ పేషేంట్లు లేరా? మీరెందుకు డ్యూటీ ఆఫ్ కేర్ కింద పోలీసులకి ఇంఫార్మ్ చెయ్యలేదు ఇంకా!?’
‘సారీ డా శ్రీకాంత్, కానీ హి ఈస్ ఎ పవర్ఫుల్ మ్యాన్, ఇక్కడున్న పోలీసులందరు అతని మాటే వింటున్నారు, నో వన్ ఈస్ రెడీ టు టేక్ ఏక్షన్ ఎగెనెస్ట్ హిమ్ !’ అన్నాడు డా రవి తన నిస్సహాయతని తెలుపుతూ .
‘సర్లే, ఇవన్నీ మనకి అక్కర్లేని విషయాలు, హోప్ షీ విల్ బీ సేఫ్, మనసుని వశపరుచుకునే మందుల్లేవని చెప్పి పంపేయ్!?’
‘ఒకే డా. శ్రీకాంత్!?’ అంటూ క్లినిక్‌లోకి వెళ్ళిపోయాడు డా. రవి.
*******
మరుసటిరోజు, ఆఫీసులో నా కుర్చీలో కూర్చుని సైకోడైనమిక్ థియరీ పుస్తకం చదువుకుంటుంటే, డా రవి వచ్చి తలుపు తట్టాడు.
‘యెస్ డా. రవి, చెప్పండి, ఈరోజేంటీ?’ అని అడిగాను.
‘నథింగ్ డా శ్రీకాంత్, నిన్న చెప్పినతను ఒకావిడని కిడ్నాప్ చేసాడని చెప్పాను కదా, ఆవిడని చివరకి వాళ్లాయనే రెస్క్యూ చేశాడు.’ అన్నాడు ముఖంలో ఆనందంతో.
నేను కూడా ఆనందంతో, ‘వండర్ఫుల్’ అని చెప్పి, ‘కిడ్నాపర్ ఏమయ్యాడు!?’ అని అడిగాను.
‘అదో పెద్ద కథ, ఈ కిడ్నాప్ కిగురైన ఆవిడ వాళ్ళాయన చాలా సాధారణ వ్యక్తి, కానీ అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుని కిడ్నాపర్ని పొట్టలో పొడిచి చంపేశాడు.’ అన్నాడు భుజాలు ఎగరేస్తూ, ఏం చేస్తాం అన్నట్లు.
నేను కూడా, ‘వెరీ సాడ్’ అంటూ, ‘అసాంఘిక వ్యక్తులు చాలా సందర్భాల్లో ఈవిధంగానే వాళ్ళు చేసిన నేరాలవలన సాధారణ ప్రజలకంటే ముందే చనిపోతారు. పైగా వీళ్ళకి నార్సిస్టిక్ పెర్సనాలిటీ తీవ్రంగా ఉండటం వలన వీరి ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉండి ఇటువంటి పరిణామాల్ని ఎదుర్కొంటారు, వీళ్ళ మెదళ్లను శవపరీక్షలో ఒకసారి పరిశీలించి కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి’ అన్నాను.
‘అతని బాడీని ఇక్కడికే శవ పరీక్షకి తీసుకొచ్చారు, పాథాలజిస్ట్ మనకోసం వెయిట్ చేస్తున్నారు అటాప్సీ రూంలో’ అన్నాడు.
ఇద్దరం వెళ్ళాం అక్కడికి.
శవ పరీక్ష బల్లమీద ఒక శవం ఉంది. ఆ శవానికి పది తలలున్నాయి.
శవపరీక్ష
— Srikanth Miryala (@miryalasrikanth) June 17, 2023
నేను వడివడిగాక్లినిక్ వైవు నడుచుకుంటూ పోతున్నాను,
డా శ్రీకాంత్, ఒక్క నిమిషం! వెనకనుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న జూనియర్ డాక్టర్ పిలుస్తున్నాడు.
నేను ఏంటి విషయం అన్నట్లు ఒక చూపు విసిరా, చెప్పు రవి అని అనొచ్చు కానీ, సీనియర్ డాక్టర్ కాబట్టి, ఎంత తక్కువ మాట్లాడితే…