Advertisementt

చిరంజీవితో గొడవల్లేవంటోన్న సుధాకర్

Mon 19th Jun 2023 01:31 AM
sudhakar,chiranjeevi,pawan kalyan,binny,comedian  చిరంజీవితో గొడవల్లేవంటోన్న సుధాకర్
Sudhakar About Megastar Chiranjeevi చిరంజీవితో గొడవల్లేవంటోన్న సుధాకర్
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ టాలెంట్ ఉన్న నటులలో సుధాకర్ ఒకరు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా ఎన్నో పాత్రలకి ఆయన న్యాయం చేశారు. ఇవన్నీ అలా ఉంచితే.. ఆయన మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడు. కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి, సుధాకర్ ఒకే రూమ్‌లో ఉన్నట్లుగా ఎన్నో సార్లు సుధాకర్ తెలిపారు. అలాంటి సుధాకర్ పరిస్థితి ఇప్పుడు బాగోకపోతే.. కనీసం చిరంజీవి పలకరించను కూడా పలకరించడం లేదంటూ కొన్ని రూమర్స్ ఈ మధ్య వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య గొడవలు జరిగినట్లుగా కొన్ని కథనాలు బయటికి వచ్చాయి. అయితే సుధాకర్ మాత్రం చిరంజీవితో ఇప్పటికీ మంచి స్నేహం ఉందని చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న బంధంపై, వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. 

నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. అలాగే చిరంజీవి నాకేం చేయలేదంటూ కొందరు వార్తలు పుట్టిస్తున్నారు. మా కెరీర్ మొదలైనప్పుడు నేను, చిరంజీవి ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య స్నేహం అలానే ఉంది. ఏ అవసరం వచ్చినా.. కాల్ చేస్తే చాలు స్పందిస్తారు. ఇప్పటికీ ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడతారు. మా మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు లేవు.. లేని వాటిని సృష్టించేలా రాతలు రాయవద్దని అని సుధాకర్ తెలిపారు.

ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన కుమారుడిని పరిచయం చేస్తూ.. సినిమా పరిశ్రమలో నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నా కొడుకు బిన్నీ సినిమాలలోకి రావాలని అనుకుంటున్నాడు. వాడిని కూడా అందరూ నన్ను ఆదరించినట్లే ఆదరిస్తారని అనుకుంటున్నాను. చిరంజీవి కూడా మా వాడిని ఆశీర్వదించారు. చిరంజీవి మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా నేనంటే ఎంతో ఇష్టపడతాడు. మా అబ్బాయి పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్. ఆయన ఆశీస్సులు కూడా మా వాడికి ఉంటాయి అని.. సుధాకర్ చెప్పుకొచ్చారు. 

Sudhakar About Megastar Chiranjeevi:

Comedian Sudhakar Clarity about Rumours on Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ