Advertisementt

ఆదిపురుష్‌లో అవి మార్చేస్తున్నారు

Sun 18th Jun 2023 11:57 PM
adipurush,dialogues,revamps,prabhas  ఆదిపురుష్‌లో అవి మార్చేస్తున్నారు
Adipurush Team Takes Sensational Decision ఆదిపురుష్‌లో అవి మార్చేస్తున్నారు
Advertisement

ప్రభాస్ శ్రీరాఘవుడిగా, కృతి సనన్ జానకిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన చిత్రం ‘ఆదిపురుష్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజులకే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడంతో పాటు.. ప్రభాస్ కోసం వేచి చూస్తున్న ఆయన అభిమానులు ఈ సినిమాని ఎగబడి మరీ చూస్తున్నారు. దీంతో టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్‌ను రాబడుతోంది. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే మరో వైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభ్యంతరాలను గమనించిన చిత్రయూనిట్.. సన్నివేశాల గురించి ఏం చెప్పలేదు కానీ.. డైలాగ్స్ విషయంలో మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్‌లో ఆదిపురుష్‌ను చూడవచ్చంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.

టాక్‌తో సంబంధం లేకుండా.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకెళుతోన్న ఈ చిత్రం విషయంలో.. ఇప్పుడు డైలాగ్స్ మార్చడం అంటే సాహసంతో కూడుకున్న పనే అయినా.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఫీల్ పోకుండా మారుస్తున్నామని చెబుతున్నారు కాబట్టి.. మార్చిన డైలాగ్స్‌తో ‘ఆదిపురుష్’ టాక్‌లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం.. 

Adipurush Team Takes Sensational Decision:

Team Adipurush in respect of Public Opinion

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement