Advertisementt

విరాటపర్వం.. నిద్రలేని రాత్రులనిచ్చిందట

Sun 18th Jun 2023 11:34 PM
virata parvam,venu udugula,emotional post  విరాటపర్వం.. నిద్రలేని రాత్రులనిచ్చిందట
Venu Udugula Emotional Post on Virata Parvam విరాటపర్వం.. నిద్రలేని రాత్రులనిచ్చిందట
Advertisement
Ads by CJ

విరాటపర్వం విడుదలై ఏడాది పూర్తయిందంటూ దర్శకుడు వేణు ఊడుగుల ఓ ఎమోషనల్ మెసేజ్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. విరాటపర్వం చిత్రం తనకి, ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి తరచి చూసుకునేలా చేసిందంటూనే.. ఈ సినిమా కాలి కింద మందుపాతర పేలినట్లు చేసిందంటూ.. ఎమోషనల్ అయ్యారు. రానా, సాయిపల్లవి ప్రధాన తారాగణంగా వచ్చిన విరాటపర్వం చిత్రం.. మంచి అంచనాలతో వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయినా ప్రేక్షకులకి ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్‌నే ఇచ్చింది. ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా దర్శకుడు వేణు ఊడుగుల.. మరొక్కసారి ఆ సినిమాని గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన..

‘‘విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. 

అందుకే విరాటపర్వం నాకు ఒక Self discovery లాంటిది. తీయబోయే చిత్రాలకు Preamble లాంటిది. విరాటపర్వం అనే ప్రయాణం మొదలెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఇకముందు ఈ అనుభవంలో భాగమైన నా ప్రేక్షకులకు, తూము సరళక్క కుటుంబ సభ్యులకు, సినిమాలో నటించిన నటీనటులకు, నా డైరెక్షన్ టీమ్ కి, రైటింగ్ టీమ్‌కి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి, మీడియా మిత్రులకు, విమర్శకులకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు.

Venu Udugula Emotional Post on Virata Parvam:

Director Reacted on Virata Parvam Completed On Year Occasion 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ