Advertisementt

చరణ్, ఉప్సీల బిడ్డ కోసం ఉయ్యాల.. స్పెషలిదే

Sun 18th Jun 2023 04:37 PM
upasana,mega family,ram charan,prajwala foundation  చరణ్, ఉప్సీల బిడ్డ కోసం ఉయ్యాల.. స్పెషలిదే
Upasana Gets Gift From Prajwala Foundation చరణ్, ఉప్సీల బిడ్డ కోసం ఉయ్యాల.. స్పెషలిదే
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు అతి త్వరలో తల్లిదండ్రులుగా మారబోతోన్న విషయం తెలిసిందే. మెగా ఇంట సంబరాలకి ఇంకెంతో సమయం కూడా లేదు. ఏ నిమిషంలోనైనా సింబాకు సంబంధించిన న్యూస్ రావచ్చు. ఈ నెలలోనే ఉపాసనకు డెలివరీ డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయానికి ముందే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శుభాకాంక్షలే కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వారిని అపురూపమైన కానుకలతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు ఓ అపురూపమైన గిఫ్ట్ వచ్చినట్లుగా ఉపాసన కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఆ అపురూపమైన కానుకను చూసి చరణ్ ఏమో గానీ ఉపాసన మాత్రం ఎంతగానో మురిసిపోతోంది. ఆ విషయం ఆమె చేసిన పోస్ట్‌లో ఉపాసనే చెప్పుకొచ్చింది. ఇంతకీ ఉపాసనకు వచ్చిన కానుక ఏమిటని అనుకుంటున్నారా? ఉయ్యాల. ఇది అలాంటిలాంటి ఉయ్యాల కాదు.. ఎంతో ప్రేమతో ప్రజ్వల ఫౌండేషన్ వారు నా బిడ్డ కోసం ఈ ఉయ్యాల చేసి పంపించారు అంటూ.. ఆ ఉయ్యాల మేకింగ్ వీడియోను కూడా ఉపాసన షేర్ చేసింది. 

అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ చెక్క ఉయ్యాలను ప్రజ్వల ఫౌండేషన్‌లోని కొంత మంది అమ్మాయిలు నా బిడ్డ కోసం స్వయంగా దీనిని తయారు చేశారంటే.. నిజంగా నమ్మలేకపోతున్నాను. వారంతా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి బయటపడిన వారు. వారి నుంచి ఇటువంటి గొప్ప కానుకను పొందినందుకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ ఉయ్యాలను వారు ఎంతో ప్రేమతో నాకోసం చేసిన తీరు నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ చేతితో చేసిన ఉయ్యాలను చూస్తుంటే.. నాకు చాలా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రేమ, బలం, ఆశ ఇటువంటి వన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీనా బిడ్డ పుట్టినప్పట్నుంచి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన ప్రయాణాన్ని, ఆత్మగౌరవాన్ని సూచిస్తున్నాయి. అని తెలుపుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన సునితా కృష్ణన్‌కు ఉపాసన కృతజ్ఞతలు తెలిపింది. ఎంత గొప్ప మనసు మీది.. అంటూ ఉపాసన చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Upasana Gets Gift From Prajwala Foundation:

Prajwala Foundation Gifts Handcrafted Cradle to Upasana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ