Advertisementt

డిజప్పాయింట్ మోడ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్

Sun 18th Jun 2023 03:35 PM
prabhas,adipurush,disappoint,prabhas fans,salaar,  డిజప్పాయింట్ మోడ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
Rebel Star Prabhas Fans in Disappoint Mode డిజప్పాయింట్ మోడ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత ప్రభాస్ సాహోతో భారీ హిట్ కొడతాడని, పాన్ ఇండియా మార్కెట్లో మరోసారి ప్రభాస్ పేరు మోగిపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటే.. సుజిత్ సాహోతో ప్రభాస్‌కి, ఫ్యాన్స్‌కి హోల్సేల్‌గా షాకిచ్చాడు. ఆ తర్వాత రాధా కృష్ణ అయినా రాధేశ్యామ్‌తో ఫ్యాన్స్‌కి హిట్ ఇస్తాడు, ప్రభాస్‌ని నిలబెడతాడు అనుకుంటే.. అదో ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ ఆదిపురుష్ అనేసరికి అబ్బో ఇది ఖచ్చితంగా హిట్టే. తానాజీ దర్శకుడు కదా అనుకున్నారు.

కానీ టీజర్‌తో ఇచ్చిన షాక్ మరవకుండానే సినిమా రిలీజ్ చేసి బిగ్గెస్ట్ షాకిచ్చాడు. ఆ రెండు ప్లాప్స్ తర్వాత ఆదిపురుష్ కూడా డిజాస్టర్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతూ డల్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. హ్యాట్రిక్ ప్లాప్‌లు ప్రభాస్ కెరీర్‌ని డౌన్ చేస్తాయేమో అని వాళ్ళ బాధ. కానీ ప్రభాస్ మార్కెట్ ఏ కోశానా తగ్గదు. కారణం ఆయన పాన్ ఇండియా లైనప్ అలా ఉంది. సలార్, ప్రాజెక్ K, స్పిరిట్ ఇవన్నీ ఆయన రేంజ్ పెంచే సినిమాలే.

కాకపోతే ప్రభాస్ మంచి కాంబోలని సెట్ చేసుకుంటే కుదరదు.. అందుకు తగ్గ కథలని కూడా సెట్ చేసుకోవాలి. ప్రేక్షకులకి నచ్చే కథలను, కంటెంట్ బలంగా ఉన్న కథలలోతే ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ కూడా డిజప్పాయింట్ చేయడంతో వారి హోప్స్ అన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ మీదే ఉన్నాయి.

Rebel Star Prabhas Fans in Disappoint Mode:

After Adipurush Result Prabhas Fans Hopes On Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ