ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు టాలెంటెడ్ యాక్టర్ JD చక్రవర్తి ఆ తర్వాత హీరోగా, విలన్ గా సత్తా చాటాడు. అయితే కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న JD చక్రవర్తి రీసెంట్ గా ఓ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా JD చక్రవర్తి తన వ్యక్తి గత, కెరీర్ విషయాలను యూట్యూబ్ ఛానల్స్ తో పంచుకున్నాడు. దానిలో భాగంగా ఎనిమిది నెలల పాటు తనపై జరిగిన ఓ విష ప్రయోగాన్ని JD ఈ సందర్భంగా బయటపెట్టి షాకిచ్చాడు,
అంతేకాకుండా ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహం ఉందని.. ఓసారి తాను, ఎన్టీఆర్ కలిసి కారులో మెహిదీపట్నం వెళుతున్నప్పుడు కారు 110 నుండి 120 స్పీడులో ఉండగా కళ్ళు మూసుకుని తోలితే ఎలా ఉంటుంది అని ఎన్టీఆర్ అడిగాడు. నేను అప్పటికే ఆ స్పీడుకి భయపడుతున్నాను, కళ్ళు మూసుకుని అంటే నా ప్రాణం పైనే పోయింది. అయినా ఎన్టీఆర్ అక్కడక్కడా కళ్ళు తెరుచుకునే కారు తోలి ఉంటాడు. లేదంటే ఇప్పుడు మీముందు ఇలా ఉండేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
నాకు ఎలాంటి చెడు వ్యసనాలు లేవు, హెల్దీగా ఉండే నాకు ఉన్నట్టుండి బ్రీతింగ్ ప్రాబ్లెమ్ వచ్చింది. చాలామంది డాక్టర్స్ పరీక్షలు హెసెరు. దేశ విదేశాల డాక్టర్స్ టెస్ట్ లు చేసి చేతులెత్తేశారు. కానీ నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ శేషు రెడ్డి నన్ను డాక్టర్ నాగార్జున దగ్గరికి తీసుకెళ్లగా ఆయన అన్ని టెస్ట్ లు చేసి డ్రగ్స్ ఎందుకు తీసుకున్నావని అడగ్గానే షాకయ్యను. ఎందుకంటే నాకు చెడు అలవాట్లు లేవు. నేను ఎడిటింగ్ చేసే సమయంలో రోజూ కాషాయం తాగేవాడిని.
దానిని ఓసారి నా ఫ్రెండ్ ఖాసీం తాగి వాంతులు చేసుకుని జ్వరం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నేను నాకు కాషాయం ఇచ్చే వ్యక్తితో చెప్పాను. చూసావా నువ్విచ్చే కాషాయం నేను తప్ప ఎవ్వరూ తగలేరు అన్నాను, దానితో అతను షాకయ్యాడు. నీకు చేసిన కషాయాన్ని నువ్వు వేరేవాళ్లకి ఎందుకిచ్చావ్ అంటూ తిట్టాడు. అయితే ఖాసీం డ్రింక్ చేస్తాడు. కాబట్టి అతను కాషాయం తాగగానే అలా రియాక్షన్ చూపించి మంచాన పడ్డాడు. చివరికి నాకు శ్వాస కోసం వ్యాధి విషయంలో తెలిసినది ఏమిటంటే నాపై ఎనిమిది నెలలపాటు విష ప్రయోగం జరిగింది అని చెప్పాడు. అయితే తనకి విషం ఎవరిచ్చారు అనేది మాత్రం బయటపెట్టలేదు JD.