Advertisementt

సాయి పల్లవిని మరిపించిన మహేష్ తనయ

Sat 17th Jun 2023 01:35 PM
sitara,sarangadariya  సాయి పల్లవిని మరిపించిన మహేష్ తనయ
Mahesh daughter Sitara mesmerizing steps for Sai Pallavi song సాయి పల్లవిని మరిపించిన మహేష్ తనయ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ డాన్స్ నేపథ్యంలో, కులాల మధ్యన వివక్ష నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి వేసిన స్టెప్స్ కి ప్రేక్షకులు, డాన్స్ ప్రియులు మురిసిపోయారు. ఆ చిత్రంలో సారంగా దారియా సాంగ్ లో సాయి పల్లవి వేసిన స్టెప్స్ కి యూట్యూబ్ షేక్ అయ్యింది. రికార్డ్ లైక్స్ కూడా వచ్చాయి. ఆ సాంగ్ సాయి పల్లవి చేసాక.. బయట చాలా స్టేజ్ లపై, ఇంకా చాలా చోట్ల ఆ పాట మార్మోగిపోయింది. అయితే ఇప్పుడు మహేష్ తనయ సితార సారంగ దారియా సాంగ్ కి డాన్స్ చేసి అదరగొట్టేసింది.

సాయి పల్లవి లంగాఓణిలో ఎలా అయితే ఆ పాటకి స్టెప్స్ వేసి అలరించిందో.. సితార కూడా చక్కగా తెలుగుదనం ఉట్టిపడేలా లంగావోణీ కట్టి సారంగా దారియా పాటకి స్టెప్స్ వేసింది. సితార డాన్స్ వీడియో చూసిన వాళ్లంతా మహేష్ తనయ సితార సాయి పల్లవి లా అభినయము, ఆమెలా వేసిన స్టెప్స్ అదిరిపోయాయి.. సాయి పల్లవిని మరపించిందిగా ఈ క్యూటీ అంటూ పొగిడేస్తున్నారు.

Mahesh daughter Sitara mesmerizing steps for Sai Pallavi song :

Sitara dances to Sai Pallavi song.. Sarangadariya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ