నిన్న జూన్ 16 న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3D లో వీక్షించిన వారు మిక్స్డ్ రెస్పాన్స్ చూపించగా.. మిగతా భాషల్లో ముఖ్యంగా హిందీలో ఆదిపురుష్ కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. తమిళ, కన్నడ, మలయాళ భాషా ప్రేక్షకులు ఆదిపురుష్ ని ఎంతగా లైట్ తీసుకున్నారంటే. ఓవర్సీస్ లో తమిళ వెర్షన్ కి 24 థియేటర్స్ కేటాయిస్తే.. మొదటి రోజు 24 టికెట్స్ బుక్ అయ్యేంతగా. ఇక ఆదిపురుష్ సినిమాకి పబ్లిక్ రెస్పాన్స్ చూస్తే ఇకపై ఇది థియేటర్స్ లో ఆడడం కష్టమనిపించేలా ఉంది వ్యవహారం.
అయితే ఆదిపురుష్ ని థియేటర్స్ లోనే వీక్షించమని మేకర్స్ ముందునుండి కోరుతున్నారు. ఎనిమిది వారాల తర్వాతే ఆదిపురుష్ ఓటిటి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. సో ఆదిపురుష్ థియేటర్ ఎక్స్పీరియెన్స్ చెయ్యమని అడిగారు. కాని ఇప్పుడు ఆదిపురుష్ కొచ్చిన టాక్ చూస్తే అది థియేటర్స్ లో చూసేందుకు ఆడియన్స్ రెడీగా లేరు. అందుకే ఆదిపురుష్ ఓటిటి పార్ట్నర్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. అయితే ఆదిపురుష్ ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకున్నటుగా తెలుస్తుంది.
మరి అమెజాన్ నుండి మూడు, నాలుగు వారాలకే సినిమా స్ట్రీమింగ్ లోకి రాదు. ఖచ్చితంగా ఎనిమిది వారాల తర్వాతే ఆదిపురుష్ ని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.