యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న దేవర మూవీ షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. దేవర షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ ఎండ్ కల్లా పూర్తి చేసేలా కొరటాల-ఎన్టీఆర్ దేవర షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ దేవర షూటింగ్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీ వార్ 2 లో జాయిన్ అవ్వబోతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న వార్ 2 మూవీలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ చిత్రంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. వాళ్లెవరితోను హ్రితిక్ రోషన్ కానీ, ఎన్టీఆర్ కానీ రొమాన్స్ చెయ్యరు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ లోకి బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ఎంటర్ అవ్వబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎక్స్ క్లూజివ్ అని.. వార్ 2 లో హీరోయిన్ గా కియారా ఎంపికయ్యింది అంటూ రాస్తున్నారు.
మరి ఎన్టీఆర్ దేవర మూవీలో కియారాతో రొమాన్స్ చేయాలనుకున్నారు. కానీ కియారా అద్వానీ డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి కొరటాల షిఫ్ట్ అయ్యారు. అక్కడ మిస్ అయినా ఎన్టీఆర్ ఇక్కడ వార్ 2 లో కియారా తో స్టెప్స్ వేస్తారేమో చూడాలి. అన్నట్టు వార్ 2 లో హ్రితిక్ రోషన్-ఎన్టీఆర్ పై అదిరిపోయే ఓ సాంగ్ కూడా పెట్టబోతున్నారట.