ఓమ్ రౌత్ హిందీ డైరెక్టర్. టి సీరీస్ వాళ్ళు హిందీలో బడా నిర్మాతలు. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ తో ఓమ్ రౌత్ ఆదిపురుష్ కి శ్రీకారం చుట్టగానే అందరిలో ఎన్నో అంచనాలు. బాహుబలిగా ప్రభాస్ రూపాన్ని ఇంకా మనసులో ఆరాధించే అభిమానులు.. ఆదిపురుష్ లో రాముడిగా ఎలా చూస్తామో అని ఊహించుకుంటూ ఊహాజనిత ప్రభాస్ రాముడి స్కెచ్ లతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తే ఓమ్ రౌత్ మాత్రం కూల్ గా ఆదిపురుష్ టీజర్ తో బిగ్ షాకిచ్చారు. ఆ టీజర్ తర్వాత ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ పై హోప్స్ వదులుకున్నారు. ప్రభాస్ ఖాతాలో మరో డిసాస్టర్ అని ఫిక్స్ అయ్యారు.
ఆ దెబ్బకి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసేసారు మేకర్స్. బెస్ట్ గ్రాఫిక్స్ కోసమే అని చెప్పుకొచ్చారు. సరే ఆదిపురుష్ పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ సమయానికి ఫాన్స్ ని సెట్ చేసారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, సెకండ్ యాక్షన్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అదీ కేవలం తెలుగులోనే. కానీ తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆదిపురుష్ కి పూర్ రివ్యూస్ వచ్చాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ తప్ప తెలుగు ఆర్టిస్ట్ మరొకరు లేరు. మొత్తం హిందీ వాళ్ళే. అయినా బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఓమ్ రౌత్ కి, టి సిరీస్ కి షాకిచ్చారు.
తరుణ్ ఆదర్శ్ లాంటి టాప్ క్రిటిక్స్ ఆదిపురుష్ డిస్పాయింటింగ్ అంటూ 1.5 రేటింగ్ ఇవ్వగా.. ఆదిపురుష్ కి అసలైన విలన్ ఓమ్ రౌత్ అంటూ తమిళ క్రిటిక్స్ తేల్చేసారు. ఓమ్ రౌత్ హిందీ దర్శకుడు.. అక్కడేమైనా ఆదిపురుష్ కి బాలీవుడ్ మీడియా కాస్త ప్రాధాన్యత ఇస్తుంది అనుకుంటే.. బాలీవుడ్ మీడియా, క్రిటిక్స్ అంతా ఓమ్ రౌత్ కి హోల్సేల్ షాకిచ్చారు. దర్శకనిర్మాతలు హిందీ వాళ్ళు అని కూడా కనికరం లేకుండా ఆదిపురుష్ ని ఏకి పారేస్తున్నారు.