స్టార్ హీరోల అభిమానులు ఈ మధ్యన ఎక్కువగా రెచ్చిపోతున్నారు. తమ అభిమాన హీరోని ఏమైనా అంటే చాలు వాళ్ళని చంపేదాకా వెళ్లిపోతున్నారు. తాజాగా ప్రభాస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఆదిపురుష్ ఈరోజే రిలీజ్ అయ్యింది. అయితే ఈమధ్యన సినిమా చూసాక ప్రతి ఒక్కరూ ఆ సినిమాపై తమ అభిప్రాయాలను యూట్యూబ్ ఛానల్స్ తో పంచుకోవడం ఫ్యాషన్ అయ్యిపోయింది. సినిమా చూసొచ్చి మైక్ పట్టుకుని.. సినిమా అలా, సినిమా ఇలా, హీరో అలా చేసాడు, దర్శకుడు ఇలా తీసాడు అంటూ ముచ్చట్లు పెడుతూ ఛానల్స్ లో ఫేమస్ అవుతున్నారు.
అలాగే ఈరోజు విడుదలైన ఆదిపురుష్ చూసిన ఆడియన్స్ బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని చుట్టుముట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఆదిపురుష్ వీక్షించిన ఆడియన్స్ దగ్గరకి వెళ్లి సినిమా ఎలా ఉంది అంటూ అడగడంతో కొంతమంది తాము సినిమా చూసాక ఏం ఫీలయ్యారో అదే చెప్పారు. ప్రభాస్ రాఘవుడి గెటప్లో సెట్ కాలేదు, బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటే ఆదిపురుష్ నిరాశ పరిచింది, ఓం రౌత్ రామాయణాన్ని తియ్యడంలో ఫెయిల్ అయ్యాడు, ప్రభాస్ డబ్బింగ్ బాలేదు, గ్రాఫిక్స్ వీక్ అంటూ ఓ ప్రేక్షకుడు తన రివ్యూ ఇచ్చాడు.
అంతే.. అక్కడే ఉన్న ప్రభాస్ ఫాన్స్ మా ప్రభాస్ సినిమాకే పేర్లు పెడతావా.. సినిమా బాలేదు అని చెప్పినా ఓకె.. ప్రభాస్ బాగా చెయ్యలేదు అని చెప్పడానికి నీకెంత ధైర్యం అంటూ ఆ ప్రేక్షకుడిని చొక్కా పట్టుకుని కొట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ప్రేక్షకుడిని ప్రభాస్ ఫాన్స్ ఫాన్స్ చితకబాదరు. అలా కొట్టడం చూసిన నెటిజెన్స్ సినిమా బాలేదు అంటే కొట్టేస్తారా.. ఓపెన్ గా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రభాస్ ఫాన్స్ పై ఫైర్ అవుతున్నారు.