హిందీలో నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తమన్నా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. హిందీ నటుడు విజయ్ వర్మ తో కొద్దిరోజులుగా సీక్రెట్ డేటింగ్ లో ఉన్న తమన్నాని మీడియా పదే పదే వారి ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించినా.. తమన్నా మాత్రం సమాధానం చెప్పలేదు. కానీ లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. దానితో ఆమెని పెళ్ళెప్పుడు చేసుకుంటారంటూ మీడియా అడుగుతూనే ఉంది.
అయితే తమన్నా మాత్రం పెళ్లి అనేది ముఖ్యమైన బాధ్యత, పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు. అది చాలా కాలం కలిసి ఉండే విషయం. మనం సిద్ధంగా ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు, అది చాలా కాలం కలిసి ఉండే సందర్భం. అందుకే ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నా కెరీర్ మొదలు పెట్టినప్పుడు పదేళ్లు బిజీగా వుంటాను అని అనుకున్నాను.
అంతేకాకుండా 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని అనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. నేను కెరీర్ లో బిజీ అయ్యి పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. నేను మొదట్లో పక్కవారి ఆలోచనలకి ప్రభావితమయ్యేదాన్ని. కానీ తర్వాతరవాత సొంతంగా నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తున్నాను.. అంటూ తమన్నా తన పెళ్లి విషయాన్ని చెప్పుకొచ్చింది.