స్టార్ హీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోతూ అభిమాన హీరోల సినిమాల విడుదల రోజున రచ్చ చేస్తారో అనేది సోషల్ ఇండియాలో ప్రాచుర్యంలోకి రాకముందు నుండే చూస్తున్నాం. ఇక సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ అతి మరింతగా ఎక్కువైంది. ఈమధ్యన ఫ్యాన్స్ అతి ఎంత దూరం వెళ్ళింది అంటే.. ఒకరి హీరో గొప్ప అంటే మరొకరి హీరో గొప్ప అనుకునే రేంజ్ నుండి మర్డర్స్ చేసుకునే స్థితికి అభిమానులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. అయితే ఈరోజు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలైంది.
ఆదిపురుష్ విడుదలైన థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్ ఒకరు బీరు బాటిల్ ఒకటి పగలగొట్టి పదే పదే చేతిని కోసుకుని ఆ రక్తంతో ప్రభాస్ ఫోటో నుదుటున తిలకం దిద్దాడు. ఆ తర్వాత కూడా బీరు బాటిల్ పక్కనపడెయ్యకుండా డాన్స్ చేస్తూ రచ్చ చేస్తూ పలుమార్లు చేతులు కోసుకుంటూ హంగామా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలా ప్రభాస్ ఫ్యాన్ అలా చేస్తుంటే పక్కనున్నవాళ్ళు ఎంజాయ్ చేస్తూ వీడియో తీశారు కానీ.. అతన్ని ఆపే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.
అలా ప్రభాస్ ఫ్యాన్ చెయ్యికోసుకుని రక్త తిలకం దిద్దిడం నెటిజెన్స్ కి నచ్చడం అటుంచి నీ ఫ్యామిలీ కన్నా ప్రభాస్ ఎక్కువయ్యాడా.. అది కూడా ప్రభాస్ ఎదురుగా లేడు, అతని ఫోటో దగ్గర ఇలాంటి రచ్చ చెయ్యడం, చేతులు కోసుకోవడం అవసరమా అని తిట్టిపోస్తున్నారు.