పుష్ప ద రైజ్ మూవీ తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మార్కెట్ లో భారీగా గ్రాఫ్ పెంచుకున్నాడు. పుష్ప పార్ట్ 1 కి పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే నార్త్ ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ద రైజ్ షూటింగ్ తో బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఫుల్ స్వింగ్ లో షూటింగ్ చిత్రీకరణ జరుపుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప 2 నుండి ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు.. నిజంగా ఆ వీడియో చూస్తే దిమ్మతిరగడం ఖాయమంటూ అల్లు ఫ్యాన్స్ విర్రవీగుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప పార్ట్1 కి కొనసాగింపుగా పుష్ప ద రూల్ తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఈ లీకైన వీడియోలో ఎర్ర చందనం దుంగలు లోడుతో లారీలు రోడ్డు మీదుగా కాకుండా.. పోలీసులకి దొరక్కుండా ఉండేందుకు నదిలోనే అంటే నీళ్లలోనే లారీలన్ని పొనిస్తున్నారు. అక్కడ దర్శకుడు సుకుమార్ లారీల్లో ఎర్ర చందనం దుంగల లోడులతో లారీలు వెళుతున్న సన్నివేశాల చిత్రీకరణను ఎవరో లీక్ చేసి వైరల్ చేసారు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సన్సేషనల్ అయ్యి కూర్చుంది. రీసెంట్ గానే విలన్ ఫహద్ ఫాసిల్ పై సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేసిన సుకుమార్ ప్రస్తుతం కీలక పాత్రలతో కొన్ని సన్నివేశాలు చిత్రీకణ చెస్తున్నట్టుగా తెలుస్తుంది.