ప్రస్తుతం సీనియర్ హీరోలు గ్లామర్ భామలతో జోడీ కడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరు - బాలయ్య ఇద్దరూ గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌తో రొమాన్స్ చేసారు. ఆ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడితో భగవంత్ కేసరిలో గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో తమన్నాతో కలిసి నటిస్తున్నారు. బాలయ్య-చిరు నటిస్తున్న ఈ రెండు చిత్రాలు రెండు నెలల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అయితే వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్‌కి సంక్రాంతి హిట్ ఇచ్చిన బాబీ ఇప్పుడు బాలయ్యతో సినిమా కమిట్ చేయించుకుని ఆ సినిమాని బాలయ్య పుట్టిన రోజునాడే మొదలు పెట్టేశాడు. బాబీ -బాలయ్య NBK109 పూజా కార్యక్రమాలు జరిగినా రెగ్యులర్ షూట్ మాత్రం సెప్టెంబర్ చివరి వారం నుండి మొదలయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ మిల్కి బ్యూటీ తమన్నాతో కలిసి నటించే అవకాశం ఉండడమే కాదు.. ఇప్పటికే తమన్నాతో బాబీ చర్చలు కూడా జరిపి ఓకే చేయించాడనే న్యూస్ మొదలయ్యింది.
దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే తమన్నా బ్యాక్ టు బ్యాక్ సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు.. ముందు చిరు ఆ తర్వాత బాలయ్య అంటూ తమన్నా దూసుకుపోతుంది.