ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఆరాధించని అభిమాని ఉంటారా.. ఆయన నటించిన ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలవుతుంది. ఆదిపురుషుడిగా, రాముడిగా ప్రభాస్ ని ఆరాధిస్తున్నారా అన్నంతగా ఆదిపురుష్ మ్యానియా ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. బుక్ మై షో లో టికెట్స్ దొరకడం లేదు, సింగిల్స్ స్క్రీన్స్ లో ప్రేక్షకుల హడావిడి అబ్బో మాములుగా లేదు.. టీజర్ పై విమర్శలు చూస్తే.. ఆదిపురుష్ పనైపోయింది అనుకున్నవారు ఇప్పుడు థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రభాస్ ఫాన్స్ అయితే ప్రభాస్ కటౌట్ కి పూజలు చేస్తున్నారు. అసలు ప్రభాస్ ని రాముడిలా ఆరాధిస్తున్నారేమో అనిపించేలా ఆయన ఆదిపురుష్ కి భారీ కటౌట్ పెట్టి పూల దండాలు వేసి పూజలు జరిపించడం నిజంగా ఆశ్చర్యకర విషయమే . స్టార్ హీరోల కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చెయ్యడం, పూజలు చెయ్యడం చూసాం కానీ.. హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ లో సుదర్శన్, దేవి MM థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఆదిపురుష్ కి భారీ కటౌట్ పెట్టి దాని నిండా పూల దండాలు నింపేశారు. అలా ఆ కటౌట్ చూస్తే దేవుడికి పూజలు చేస్తున్నారనిపిస్తుంది.
ప్రస్తుతం ఓవర్సీస్, ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో బెన్ఫిట్ షోస్ పూర్తి కాబోతున్న తరుణంలో అందరూ సోషల్ మీడియాకి అతుక్కుపోయారు. ఆదిపురుష్ ఎలా ఉంది, ప్రభాస్ ఎలా చేసాడో అనే అతృతతో ఆడియన్స్ లో ఉత్సుకత పెరిగిపోతుంది. మరికొన్ని నిమిషాల్లోనే ఓవర్సీస్, బెన్ఫిట్ షోస్ టాక్ సోషల్ మీడియాకి చేరిపోతుంది.