రామ్ చరణ్-ఉపాసన పెళ్లి తర్వాత కొద్దిరోజులు మెగాస్టార్ చిరు ఇంట్లోనే ఫామిలీతో కలిసి ఉన్నారు. తర్వాత ప్రైవసీ కోసం చరణ్-ఉపాసనలు వేరు కాపురం పెట్టారు. కోనేళ్ళుగా రామ్ చరణ్-ఉపాసనలు సిటీలోనే వేరుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఉపాసన తన అత్తారింటికి షిఫ్ట్ అవుతున్నట్టుగా చెప్పింది. రామ్ చరణ్-ఉపాసనలు రీసెంట్ గానే తమ 11వ పెళ్లిరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. దానిలో భాగంగా ఉపాసన ఓ ఇంగ్లీష్ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలోనే ఉపాసన తాను తన భర్త చరణ్ బేబీ పుట్టిన తర్వాత అత్తారింటికి అంటే మెగాస్టార్ ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నట్టుగా చెప్పింది. ప్రస్తుతం చరణ్ నేను వేరుగా ఉంటున్నాం. కానీ బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమ్మ వాళ్ళింటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. కారణం మా బేబీ కి గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ కూడా కావాలి. ఎందుకంటే మా ఎదుగుదలలో మా గ్రాండ్ పేరెంట్స్ ఎలాంటి పాత్ర పోషించారో.. వాళ్ళ నుండి ఎన్నో మంచి విషయాలని నేర్చున్నాం, ప్రేమని పొందాం. అందుకే మా బేబీ కి కూడా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమని దూరం చేయాలనుకోవడం లేదు.
వాళ్లతో గడిపే ప్రతి ఆనందాన్ని మా బేబీ కి ఇవ్వలనుకుంటున్నాం అంటూ ఉపాసన తన అత్తవారింటికి షిఫ్ట్ అయ్యేది ఎప్పుడో చెప్పింది. ఇక తనకి ప్రెగ్నెన్సీ కన్ ఫామ్ అయ్యాక చరణ్ తన స్టయిల్లో సెలెబ్రేట్ చేసినట్లుగా ఉపాసన చెప్పుకొచ్చింది.