గత ఏడాది ఇదే సమయంలో సమంత బయట కనిపించకుండా అనారోగ్య కారణాలతో ఇంట్లోనే చాలా నెలలపాటు రెస్ట్ తీసుకుంది. ఆమె హెల్త్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు నడిచాయి.. తాను నటించిన యశోద ప్రమోషన్స్ సమయంలో తాను మాయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్పి అందరికి షాకిచ్చింది. మళ్ళీ ఈ ఏడాది శాకుంతలం రిలీజ్ సమయం నుండి సమంత కాస్త యాక్టీవ్ అయ్యింది. అయితే తనకి మాయోసైటిస్ వచ్చి ఏడాది పూర్తవడంతో సమంత కాస్త ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రాసింది.
నాకు మాయోసైటిస్ నిర్దారణ అయ్యి ఓ ఏడాది పూర్తయ్యింది. చాలా కష్టంగా మాములు స్థితికి చేరుకున్నాను. నా శరీరంతో నేను ఎంతో పోరాటం చేశాను. సాల్ట్ కానీ, షుగర్ కానీ లేదా ఆహార ధాన్యాల్లో ఏదీ తీసుకోలేదు. కేవలం టాబ్లెట్స్ తోనే గడిపాను. అవే ఆహారమయ్యాయి. ఎంతో కష్టంతో ఇష్టమైనవి ఆపేసాను. మరికొన్ని ఇష్టం లేకపోయినా మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది కాలంలో లైఫ్ కి అసలైన మీనింగ్ తెలుసుకున్నాను. రియలైజ్ అయ్యాను, నా కెరీర్ లో ఫెయిల్యూర్స్ ని గుర్తు చేసుకున్నాను.
అంతేకాకుండా ఎన్నో పూజలు చేశాను. అయితే భగవంతుణ్ణి మాత్రం ఏ వరమో కానీ, ఏ గిఫ్ట్ కావాలని కోరుకోలేదు. హెల్దీగా బావుండాలి, బలంగా అవ్వాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలనే ఆ భగవతుణ్ణి కోరుకున్నాను, లైఫ్ లో కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగాలని లేదు.. ఈ విషయాన్ని ఈ ఏడాది కాలంలో నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా మనం కోరుకున్నది, అనుకున్నది జరగనప్పుడు కాంప్రమైజ్ కావాలని నేర్చుకున్నాను, మనం అనుకోనివి జరగనప్పుడు సర్దుకుపోవాలి, ఏదీ కూడా పెద్ద విజయంతో రాదు, మనకి అనుకూలంగా లేని పరిస్థితులని దాటుకుని ఒక్క అడుగు ముందుకేసినా.. అది మనం సాధించిన విజయమే అవుతుంది అంటూ ఆ నోట్ లో సమంత రాసుకొచ్చింది.