విజయ్ దేవరకొండ అంటే రౌడీ ఫాన్స్ కి ఓ విధమైన క్రేజ్. ఆయన ఏ డ్రెస్ వేసినా, ఎలాంటి హెయిర్ స్టయిల్ మెయింటింగ్ చేసినా వెంటనే వాళ్ళు ఫాలో అయ్యిపోతారు. రౌడీ బ్రాండ్ పేరుతో క్లోతింగ్ బిజినెస్ కూడా విజయ్ దేవరకొండ ఎప్పుడో మొదలుపెట్టాడు. అయితే విజయ్ దేవరకొండ లైగర్ కి ముందుకు క్రేజీ హీరోగా కనిపించినా లైగర్ డిసాస్టర్ తర్వాత ఆ క్రేజ్ తగ్గుతుంది అనుకుంటే అది తగ్గకుండా విజయ్ దేవరకొండ సినిమాలను లైన్ లో పెడుతూ ఫాన్స్ కి టచ్ లో ఉంటూ వస్తున్నాడు.
ప్రస్తుతం ఖుషి మూవీ షూటింగ్ చేస్తూ VD12 ని గౌతమ్ తిన్ననూరితో పూజా కార్యక్రమాలతో ఈమధ్యనే స్టార్ట్ చేసాడు. దానికి సంబందించిన రెగ్యులర్ షూట్ రేపటినుండి మొదలు కాబోతుంది. ఇక నిన్న విజయ్ దేవరకొండ-పరశురామ్ ల VD13 దిల్ రాజు బ్యానర్ లో అఫీషియల్ గా పూజ చేసి మొదలు పెట్టారు. అయితే ఈ ఓపెనింగ్ లో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టయిల్ బావున్నా ఆయన ఫేస్ లో వచ్చిన మార్పు ఫాన్స్ కి నచ్చలేదు. అంటే విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ మెయింటింగ్ చేస్తూ లుక్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడా అనిపించేలా అతని మొహం లోని దవడలు లోపలి పోయి కనిపించాడు.
అది చూసిన రౌడీ ఫాన్స్ విజయ్ మొహంలో గ్లో కనిపించడం లేదు. గతంలో ఆయన మొహంలో ఉన్న ఇన్నోసెన్స్ ఇప్పుడు లేదు. మొహం బారుగా కనిపిస్తుంది. లుక్స్ విషయంలో విజయ్ దేవరకొండ కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అన్నట్టు ఈచిత్రంలో విజయ్ దేవరకొండ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. మృణాల్ VD13 ఓపెనింగ్ లోనే సందడి చేసింది.