అసలు ఆదిపురుష్ టీజర్ విడుదలైనప్పుడు ఉన్న నెగిటివిటి ఇప్పుడు ఏకోశానా కనిపించడమే లేదు. ఆదిపురుష్ టికెట్ బుకింగ్స్ చూస్తే రాముడి కోసాం కొంటున్నారా.. లేదంటే ప్రభాస్ కోసం థియేటర్స్ కి వస్తున్నారా అనిపించేతగా బుకింగ్స్ ఉన్నాయి. బుక్ మై షో లో ఆదిపురుష్ టికెట్స్ బుకింగ్ మొదలైన గంటలోనే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడయ్యాయి. నిన్నమొన్నటివరకు ఆదిపురుష్ పై అన్ని అనుమానాలు వ్యక్తం చేసిన ప్రేక్షకులు ఇప్పుడు దాన్ని వీక్షించేందుకు ఎందుకంతగా ఎగబడుతున్నారు.
ఆదిపురుష్ అంటూ మోడరన్ రామగా ప్రభాస్ పై వినిపించిన విమర్శలు ఇప్పుడు గుర్తు లేవా.. అసలు రామాయణం లో రాముడి ఎలా ఉంటారు.. చాలా కూల్ గా ఉంటారు. కానీ ప్రభాస్ రామగా చాలా కోపంగా కనిపిస్తున్నాడు. రాముడికి మీసాలా అనే విమర్శలు, ప్రభాస్ వాయిస్ పై కామెంట్స్.. ఇలా చాలా నెగిటివిటి ఉన్న ఆదిపురుష్ కి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది, ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వచ్చాయి. నిజంగా ఇదంతా ప్రభాస్ మాయా.. రాముడి మహిమా.. అందరిలో మెదులుతున్న ప్రశ్నే ఇది.
పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. మొన్న తిరుపతిలో ఆదిపురుష్ ఈవెంట్ అప్పుడే చాలామందిలో సినిమాపై ఒక విధమైన అంచనాలు క్రియేట్ అవ్వబట్టే.. ఇప్పుడు ఆదిపురుష్ పై ఇంత క్రేజ్, బజ్ పెరగడానికి కారణమంటున్నారు. ఒక్క ఈవెంట్ ఆదిపురుష్ పై అంత పెద్ద క్రేజ్ తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ప్రభాస్ ఆదిపురుషుడిగా ప్రేక్షకులని ఎలా మాయ చేస్తాడో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.