నిన్నగాక మొన్న తమ 13 వ పెళ్లి రోజు సందర్భంగా బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లి థాయిలాండ్ బీచ్ లో భర్త భరద్వాజ్ తో కలిసి చేసిన రచ్చ మాములుగా లేదు. అక్కడనుండి అనసూయ హైదరాబాద్ కి తిరిగిరాగానే.. విజయ్ దేవరకొండతో జరుగుతున్న వార్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విమానం మూవీ సక్సెస్ మీట్ లో సుమతి పాత్ర ఛాలెంజింగ్ పాత్ర అంటూ మాట్లాడిన అనసూయ ఇకపై మనశ్శాంతి కోసమే కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో గొడవని ఆపేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. విజయ్ పై అనసూయ చేసిన కామెంట్స్ కి రౌడీ ఫాన్స్ ఆమెని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసారు.
ఇక ప్రస్తుతం అనసూయ తన ఫామ్ లో సందడి చెయ్యడం కాదు.. భర్త తో కలిసి రచ్చ చేస్తూ తన తోటలోని మామిడికాయలు కొస్తుంది. బుల్లి నిక్కరుతో కనిపించిన అనసూయని భర్త భరద్వాజ్ ఎత్తుకోగా.. ఆమె చెట్టు మామిడికాయలు కోస్తూ కనిపించింది. అలాగే చెట్టుపై ఎక్కి మరీ మామిడికాయలు తెంచుతూ అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తల్లి తో కలిసి భర్త తో కలిసి అనసూయ మామిడి కాయలు తెంచుతూ కనిపించింది.
తోటలో కోసిన మామిడి కాయలు బ్యాగ్ లో నింపిన ఫొటోస్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం అనసూయ తన ఫామ్ లో మామిడికాయలు కోస్తూ ఉన్న హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.