ప్రభాస్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో ఉంటాడనుకుంటే.. ప్రస్తుతం ఆయన వెకేషన్ కి వెళ్లాడనే ప్రచారం జరుగుతుంది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆయన ముంబై, చెన్నై, బెంగుళూరు,హైదరాబాద్ లో ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ తిరుగుతాడనుకుంటే.. చల్లగా వెకేషన్ కి చెక్కేశాడనే న్యూస్ నడుస్తుంది. రేపు శుక్రవారం ఆదిపురుషుడి ఆగమనానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ ప్రమోషన్స్ విషయంలో ఆదిపురుష్ టీంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీక్ ప్రమోషన్స్ తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఆదిపురుష్ మూవీని ప్రభాస్ అమెరికాలో వీక్షిస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ఆదిపురుష్ విడుదలకు మూడురోజులు ముందే ప్రభాస్ అమెరికా వెళ్ళాడట. అక్కడే కొద్దిరోజులు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాడట. సో ఈ వెకేషన్ లో ఆయన అమెరికాలో ఉంటాడు కాబట్టి ఆదిపురుష్ రిలీజ్ రోజున ఆయన అక్కడే అమెరికాలో చూస్తాడని తెలుస్తుంది.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఓపెనింగ్ డే ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటే, సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.