హీరోయిన్ శ్రీలీల క్రేజ్ టాలీవుడ్ లో ఎంతగా పాకిపోయిందో నిన్న ఆమె నటిస్తున్న సినిమాల నుండి వచ్చిన అప్ డేట్స్ నిరూపించాయి. ఆమె నటించిన సినిమాలు కేవలం రెండే అంటే రెండు మాత్రమే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అవి కూడా సో సో మూవీస్. అయినప్పటికీ శ్రీలీలకి వచ్చే ఆఫర్స్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయమనిపించేలా ఆమె పుట్టిన రోజు స్పెషల్ గా వదిలిన లుక్స్ చూస్తే అర్ధమవుతుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు కాదు అంతకు మించి.
ఆమె ఒప్పుకున్న ఏడు ప్రాజెక్ట్స్ నుండి ఏడు డిఫరెంట్ లుక్స్ తో సోషల్ మీడియాలో శ్రీలీల జూన్ 14న హవా చూపించింది. ఇంకా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ మూవీస్ నుండి మాత్రమే అప్ డేట్స్ రాలేదు. ఒక్క హీరోయిన్ సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అవడం కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. అయితే ఇన్ని ప్రాజెక్ట్స్ ని ఒకేసారి ఓకె చెయ్యడం అంటే మాములు విషయం కాదు. కానీ ఇష్టం ఉంటే ఏ పని కష్టమనిపించదు అంటుంది ఆమె.
సినిమాలన్నా,నటనన్నా నాకు చాలా ఇష్టం. అందుకే ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను చేయడమనేది నాకు కష్టంగా అనిపించడం లేదు. నా కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి నాకు మంచి బ్యానర్లు, మంచి కథలు, పాత్రలు లభించడం నా అదృష్టం. నేను పనిచేస్తూ వెళుతున్న ప్రతి హీరోతో వర్క్ చేస్తూనే వాళ్ళ నుండి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను.
కానీ ఇప్పటి నుండే బాలీవుడ్ ఛాన్సుల గురించి ఆలోచించడం లేదు. దానికి చాలా సమయం ఉంది. ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే.. మంచి సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలి, అలాంటి సినిమాలు చేసుకుంటూ వెళతాను అంటూ బర్త్ డే సందర్భంగా శ్రీలీల చెప్పుకొచ్చింది.