Advertisement

జగన్ ఫోన్ చేస్తే అదే చెప్పా: జనసేనాని

Sun 18th Jun 2023 07:51 AM
pawan kalyan,kattipudi junction,varahi vijaya yatra  జగన్ ఫోన్ చేస్తే అదే చెప్పా: జనసేనాని
Pawan Kalyan Targets AP CM YS Jagan జగన్ ఫోన్ చేస్తే అదే చెప్పా: జనసేనాని
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకవైపు నాలుగైదు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. సినిమా షూటింగ్స్, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా టైమ్‌ని షెడ్యూల్‌ చేసుకున్న పవర్ స్టార్.. రెండింటికి న్యాయం చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసలెలా సాధ్యమవుతోంది ఇదంతా అని అంతా అనుకునేలా చేస్తున్నారు. ఇదంతా తనలోని నిబద్ధతని, కార్యదీక్షతని తెలియజేస్తున్నాయని జనసైనికులు, ఫ్యాన్స్ అనుకుంటున్నప్పటికీ.. నిజంగానే పవన్ కల్యాణ్.. తన నడవడికతో మరింతగా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా ఆయన ‘వారాహి యాత్ర’ను మొదలెట్టిన విషయం తెలిసిందే. 

బుధవారం.. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో చేసిన పూజల అనంతరం.. వారాహి యాత్ర మొదలైంది. అన్నవరం నుంచి కత్తిపూడికి ఆయన యాత్ర సాగింది. ఈ మార్గమధ్యంలో ప్రజలు ఆయనకి నీరాజనాలు పలికారు. ఇక కత్తిపూడి జంక్షన్‌లో వైసీపీపై మరోసారి పవన్ కత్తి దూశారు. కత్తిపూడి జంక్షన్‌లో వారాహి వాహనంపై నిల్చోని పవన్ కల్యాణ్ ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం జనాల్ని ఆలోచించేలా చేస్తోంది. ఈసారి పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో సూటిగానే.. కుంభస్థలాన్నే టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. ఈలలతో, అరుపులతో సభ హోరెత్తిపోయింది.   

2019 ఎన్నికలలో భారీ మెజార్జీతో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తనకి కూడా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా పవణ్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. భారీ మెజారిటీతో గెలిచి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు.. నన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను. నేను అందరిలా పాలిటిక్స్ చేసే వ్యక్తిని కానని చెబుతూ.. సహృదయంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. చాలా బాధ్యతాయుతమైన విపక్షనేతగా ఉంటానని చెప్పాను. ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయను.. నేను ఏది మాట్లాడినా పాలసీ పరంగా.. జనం తరపున మాత్రమే మాట్లాడతానని చెప్పాను. అసలు అలాంటి అవకాశం కూడా మాకు ఇవ్వకుండా మీరు పాలించాలని కోరాను. కానీ.. నేను భవన నిర్మాణ కార్మికుల కోసం ఎప్పుడైతే గొంతెత్తి పోరాటం మొదలు పెట్టానో.. అప్పటి నుంచి నన్ను తిట్టించడం మొదలుపెట్టాడు. మా ఇంట్లోని చిన్నపాప మీద కూడా నీచంగా కామెంట్లు చేయించాడు.. అంటూ సూటిగా జగన్‌పై పవన్ అస్త్రాలను సంధించారు. ఇప్పుడాయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan Targets AP CM YS Jagan:

Pawan Kalyan shared Interesting News about YS Jagan at Kattipudi Junction

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement