పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే మేకర్స్.. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. ప్రమోషన్స్ కి రాకపోయినా.. సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుంది. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయని నమ్ముతారు. అందుకే ఆయన్ని ప్రమోషన్స్ కి రమ్మని అడిగే సాహసం చెయ్యరు. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరై మమ అనిపించేస్తారు తప్ప చిన్న చిన్న ప్రెస్ మీట్స్ కి కానీ, సోలో ఇంటర్వూస్ కి కానీ హాజరవ్వరు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే బాటలో పయనం చేస్తున్నాడనిపిస్తుంది.
బాహుబలి సమయంలో రాజమౌళి ముందుండి ప్రమోషన్స్ ప్లాన్ చేసి ప్రభాస్ ని తీసికెళ్ళి మీడియా ముందు కూర్చోబెట్టేవారు. ప్రభాస్ కూడా రాజమౌళి వెనుకనిలబడి బాహుబలి ని ప్రమోట్ చేసారు. కానీ సాహో, రాధేశ్యామ్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఓ ఈవెంట్, ముంబై లో ఓ ప్రెస్ మీట్ అన్న చందాన ప్రభాస్ తయారయ్యారు. సాహో విషయంలో, రాధే శ్యామ్ విషయంలో ప్రమోషన్స్ వీక్ గా కనిపించాయి. ఇపుడు సేమ్ టు సేమ్ ఆదిపురుష్ విషయంలోనూ అదే జరిగింది.
దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాతలు, హీరోయిన్ కృతి సనన్ మీడియాలో కనిపిస్తున్నారు తప్ప, ప్రభాస్ ఎక్కడా కనిపించడం లేదు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో ముగించాక ప్రభాస్ కనబడలేదు. అంటే ఇలా ఓ పెద్ద ఈవెంట్ కి అటెండ్ అయితే హైప్ వస్తుంది అని ప్రభాస్ భావిస్తున్నారా.. అసలు ప్యాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ ఎలా ఉండాలి. తాను ఒకసారి ఆ ఎక్సపీరియెన్స్ చేసాడు. అయినా తెలుసుకోకపోతే ఎలా.. ఇప్పుడు సినిమా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం ప్రమోషన్స్ కే ప్లాన్ చేసుకుంటున్న రోజుల్లో ప్రభాస్ పెద్ద సినిమాని ఇలా వదిలెయ్యడం ఎంతమేరకు కరెక్ట్ అంటూ విమర్శలకు తావిస్తుంది.
ఛానల్స్ ఇంటర్వ్యూలు లేవు, మీడియా ఇంటరాక్షన్ లేదు, ఇతర భాషల్లో సినిమా ప్రమోషన్స్ లేవు.. ఎలా ఆదిపురుష్ పై హైప్ క్రియేట్ అవుతుంది. ప్యాన్ ఇండియా స్థార్ అయిపోతే సరిపోతుందా.. దానికి తగ్గ పబ్లిసిటీ కావొద్దు.. ఇప్పుడిదే ప్రభాస్ ఆదిపురుష్ పై వస్తున్న అతి పెద్ద విమర్శ. సరే పవన్ కళ్యాణ్ మాదిరిగా ప్రభాస్ కూడా మారిపోయారేమో అందుకే ఇలా అని కొందరు సరిపెట్టుకుంటున్నారు.