Advertisementt

ఆ ముచ్చట కూడా తీరిపోయింది

Wed 14th Jun 2023 03:54 PM
allu arjun,sree leela  ఆ ముచ్చట కూడా తీరిపోయింది
Sreeleela dance with Allu Arjun ఆ ముచ్చట కూడా తీరిపోయింది
Advertisement
Ads by CJ

తెలుగమ్మాయిలు సినిమాల్లో స్టార్ ఛాన్సెస్ సంపాదించలేరు, హీరోయిన్ గా స్టార్ రేంజ్ ని చేరుకోలేరు, తెలుగు అమ్మాయిలకి అంతగా మనుగడ ఉండదు అంటూ చాలామంది హీరోయిన్స్ ఇప్పటివరకు నిరూపించారు. బిందు మాధవి, ఈషా రెబ్బ, మధు షాలిని ఇలా చాలామంది హీరోయిన్స్ చిన్న చిన్న అవకాశాలతో సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఒంగోలు అమ్మాయి శ్రీలీల టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా మారిపోయింది. ఒంగోలులో పుట్టి బెంగుళూరులో పెరిగిన శ్రీలీలని అందరూ కన్నడ భామే అనుకున్నారు. పెళ్లి సందడితో టాలీవుడ్ కి దిగుమతి అయిన కన్నడ క్యూటీ అనుకున్నారు. 

అయితే ఇప్పటివరకు మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా, బాలయ్య సినిమాలో ఆయనకి కూతురుగా, పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా మాత్రమే స్టార్ ఛాన్సెస్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. యంగ్ హీరోల్లో రామ్, నితిన్, వైష్ణవ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి చిత్రాల్లో నటిస్తుంది. శ్రీలీల అల్లు అర్జున్, తారక్, చరణ్ ఇలా స్టార్ ఛాన్సెస్ ఎప్పుడు పడుతుందో అని ఆమె అభిమానులు చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. 

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో శ్రీలీల కాలు కదపబోతుంది. ఇప్పుడు ఆ ముచ్చట తీరిపోయింది. ఆహా ఒరిజినల్ కోసం అల్లు అర్జున్-త్రివిక్రమ్ లు మరోసారి జత కట్టారు. ఇప్పుడు అందులోనే అల్లు అర్జున్ తో శ్రీలీల డాన్స్ వెయ్యబోతుంది. అల్లు అర్జున్ లాంటి సూపర్ డాన్సర్ తో ఈ క్రేజీ డాన్సర్ శ్రీలీల కాలు కదిపితే బాక్సాలు బద్దలే అంటూ ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇప్పటికే శ్రీలీల బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ ఒడిలో శ్రీలీల ఉన్న పోస్టర్ రిలీజ్ చెయ్యగా అది ఇట్టే వైరల్ అయ్యింది.

Sreeleela dance with Allu Arjun:

Dancing sensations Allu Arjun, Sree Leela pairs up together

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ