విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో తెరకెక్కిన బిచ్చగాడు మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తమిళం కన్నా తెలుగులోనే బిచ్చగాడు భారీ హిట్ కొట్టడంతో విజయ్ ఆంటోని అప్పటినుండి ప్రతి సినిమాని తెలుగులో ప్రమోట్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. రీసెంట్ గా విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు 2 కి తెలుగు క్రిటిక్స్ నుండి పాజిటివ్స్ రివ్యూస్ రాకపోయినా.. ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. దానితో బిచ్చగాడు 2 కి తెలుగులో మరోసారి భారీ కలెక్షన్స్ వచ్చాయి.
మే లో థియేటర్స్ లో విడుదలైన బిచ్చగాడు 2 ఓటిటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా గూగుల్ చర్చ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటిటిలో విడుదలవుతుందా అని ఆసక్తిగా ఉన్నారు. అయితే బిచ్చగాడు 2 డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. హాట్ స్టార్ నుండి బిచ్చగాడు 2 జూన్ 18 న ఓటిటి ప్రేక్షకుల అందుబాటులోకి రాబోతుంది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ జూన్ 18 నుండే స్ట్రీమింగ్ అవ్వబోతుంది.