Advertisementt

నేను కాదు స్మగ్లింగ్ చేసింది: జబర్దస్త్ హరి

Wed 14th Jun 2023 12:16 PM
jabardasth hari  నేను కాదు స్మగ్లింగ్ చేసింది: జబర్దస్త్ హరి
Jabardasth Hari reacts on his smuggling case నేను కాదు స్మగ్లింగ్ చేసింది: జబర్దస్త్ హరి
Advertisement
Ads by CJ

నిన్న మంగళవారం ఒక్కసారిగా జబర్దస్త్ కమెడియన్ హరి అలియాస్ హరిత పేరు మీడియా ఛానల్స్ లో ప్రముఖంగా వినిపించింది. హరి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకి దొరక్కుండా పరారీలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ లు వినిపించాయి. చిత్తూరు జిలాల్లో హరి ఒక ముఠాతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడని.. ఆ ముఠాలో కిషోర్ అనే వ్యక్తి పోలీసులకి దొరికిపోయి జబర్దస్త్ హరి పేరు చెప్పాడంటూ కొన్ని వార్తలు వినిపించడం, జబర్దస్త్ హరి ఫోటో వైరల్ అవడం చూసాం. 

గతంలోనూ జబర్దస్త్ హరి ఇలానే స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకి దొరికిపోవడంతో అతని పేరు నిన్న మీడియాలో మోగిపోయింది. అయితే జబర్దస్త్ హరి అంటే తాను కాదు అంటూ హరి అలియాస్ హరిత ఓ వీడియో వదిలాడు. జబర్దస్త్ హరి అంటే తానే అనుకుంటున్నారు. నేను కాదు, గతంలో షకలక శంకర్‌ అన్న టీమ్‌లో వైఎస్‌ హరిబాబు పని చేశాడు. తర్వాత అతడు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో దొరికాడు. పోలీసుల ఎంక్వైరీలో అతడు జబర్థస్త్‌ లో పని చేసినట్లు కూడా తేలింది. అప్పట్లో నేను ఫుల్ ఫామ్ లో ఉన్నాను.

అయితే ఆ హరి ప్లేస్ లో గూగుల్ లో నా ఫోటో రావడంతో అందరూ నన్నే అనుకుంటున్నారు. నేనే స్మగ్లింగ్ చేశాను అనుకుంటున్నారు. కానీ నేను కాదు.. నేను ఎలాంటి స్మగ్లింగ్ చెయ్యలేదు. జబర్దస్త్ చేసుకుంటూ హాయిగా సంపాదించుకుంటున్నాను. ఇలాంటి నెగెటివ్ న్యూసుల వల్ల నేను చాలా అంటే చాలా సఫర్‌ అవుతున్నాను. నాకు దానికి సంబంధం లేదు. మా ఊరు నూజివీడు అంటూ అతనిపై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇచ్చాడు జబర్దస్త్ హరి అలియాస్ హరిత 

Jabardasth Hari reacts on his smuggling case:

That Hari is not me.. Jabardasth gives clarity on red sandal  case

Tags:   JABARDASTH HARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ