రామ్ చరణ్-శంకర్ మూవీ మొదలై అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జరుగుతుండగానే రామ్ చరణ్ RC15 అంటూ కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోయారు. దిల్ రాజు నిర్మాతగా మూడు లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లుక్ అండ్ టైటిల్ ని చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ కి విశేషమైన స్పందన రాగా.. ఆ చిత్రం రిలీజ్ డేట్ పై మెగా ఫాన్స్ లో ఉత్సుకత పెరిగిపోతుంది. సినిమా మొదలైనప్పుడే రిలీజ్ డేట్స్ లాక్ చేస్తున్న ఈ రోజుల్లో శంకర్ ఇంకా గేమ్ ఛేంజర్ డేట్ లాక్ చెయ్యకపోవడం మెగా ఫాన్స్ ని అసంతృప్తిలోకి నెట్టేసింది.
2024 సంక్రాంతి అనుకుంటే.. ఆ డేట్స్ ఇప్పుడు ఖాళీ లేకుండా ఫిల్ అయ్యాయి. స్టార్ హీరోలు చాలావరకు అదే డేట్స్ లో సినిమా రిలీజ్ లు పెట్టుకున్నారు. డిసెంబర్ అంటున్నారు కానీ.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దానితో రామ్ చరణ్-శంకర్ ల గేమ్ ఛేంజర్ మూవీ సమ్మర్ కి వెళ్లొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మెగా ఫాన్స్ ఈ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ పై ఇరిటేట్ అవుతున్నారు. చరణ్ కన్నా వన్ ఇయర్ లేట్ గా మొదలు పెట్టిన ఎన్టీఆర్ దేవరతో 2024 ఏప్రిల్ 5 న రావడానికి రెడీ అయ్యాడు. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డేట్ పై ఎటు తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టారు శంకర్.
అటు కమల్ తో చేస్తున్న ఇండియన్ 2 ని దివాళీ కి విడుదల చేస్తారని అన్నప్పటికీ.. ఇంతవరకు ఆ డేట్ కూడా లాక్ చెయ్యకుండా నాన్చుతున్నారు. శంకర్ గేమ్ ఛేంజర్ మరియు ఇండియన్ 2 అంటూ రెండు పడవలపై కాళ్ళు వేసి ఈదుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేస్తున్న తరుణంలో ఆ డేట్ ఎదో ఇచ్చేస్తే బావుంటుంది.. లేదంటే మెగా ఫాన్స్ ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది.