Advertisementt

ఆదిపురుష్ ఓటిటి డేట్ పై క్లారిటీ

Wed 14th Jun 2023 09:22 AM
adipurush  ఆదిపురుష్ ఓటిటి డేట్ పై క్లారిటీ
Clarity on Adipurush OTT Date ఆదిపురుష్ ఓటిటి డేట్ పై క్లారిటీ
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఆదిపురుష్ హంగామా నేడు జూన్ 14 న టికెట్ బుకింగ్ ఓపెన్ అవడంతో షురూ అయ్యింది. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాక ఆదిపురుష్ క్రేజ్ ఎంతెలా ఉందో అర్ధమైంది. టీజర్ నెగిటివిటి మొత్తం పోయి సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయి. దానితో అదే స్థాయిలో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆదిపురుష్ మేకర్స్ జూన్ 16 న సినిమా థియేటర్స్ లో విడుదలవుతుంది. 

ఖచ్చితంగా ఆదిపురుష్ ని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చెయ్యండి. ఎందుకంటే ఆదిపురుష్ మూవీ ని థియేటర్స్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. అందులోనూ త్వరగా ఓటిటిలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో.. ఆదిపురుష్ ఎనిమిది వారాల తర్వాతే అంటే ఆగష్టు సెకండ్ వీక్ లోకి ఓటిటిలోకి వస్తుంది అంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు. మరి ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ మీద చూడడానికే ఇష్టపడతారు ఆడియన్స్. 

ఓటిటి వరకు వెయిట్ చేసి ఆదిపురుష్ ని చూసేవాళ్ళు తక్కువే ఉంటారు. అయినా ఈమధ్యన నెలలోపే సినిమాలన్నీ ఓటిటిలోకి వచ్చేస్తుంటే.. చాలామంది థియేటర్స్ లో సినిమాలు చూడడం తగ్గించేసి.. ఓటిటి రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకే ఆదిపురుష్ మేకర్స్ ముందుగానే ఇలా ప్రకటన విడుదల చేసారు. 

Clarity on Adipurush OTT Date:

Adipurush OTT Release Date 2023

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ