జూన్ 16 న విడుదల కాబోతున్న ఆదిపురుష్ టికెట్ బుకింగ్స్ రేపు అంటే జూన్ 14 న మొదలు కాబోతున్నాయి. టికెట్ బుకింగ్స్ మొదలయ్యే ఒక రోజు ముందే తెలంగాణ గవర్నమెంట్ ఆదిపురుష్ మేకర్స్ కి అండగా మారింది. గతంలో భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించిందో ఇప్పుడు అదే అవకాశం ఆదిపురుష్ కి కలిపించబోతుంది. అంటే తెలంగాణాలో ఆదిపురుష్ విడుదల రోజు ప్రతి థియేటర్ లో 6 షోలకు పర్మిషన్ ఉంటుంది. జూన్ 16 న ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ప్రస్తుతం టికెట్ ధర 175 ఉండగా దీనికి అదనంగా 50 రూపాయలు పెంచుకునే అవకాశం మొదటి మూడురోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 3D సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్స్ లో గ్లాసులకు అదనపు ధర చెల్లించాలి. మల్టీప్లెక్స్ లో 295 + 3D గ్లాస్ చార్జ్ వసూలు చేయనున్నారు. దీనిపై తెలంగాణ ప్రబుభుత్వం ఇంతకుముందే ఓ జీవో ను కూడా విడుదల చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ టికెట్ రేట్స్ పై 50 రూపాయల పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్యాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆదిపురుష్ విడుదలవుతుంది. కాగా ఇప్పటికే నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కేవలం నార్త్ లోనే సుమారు 2 కోట్ల రూపాయల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆదిపురుష్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.