మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం ఫినిష్ చేసేపనిలో ఉన్నారు. తాజాగా మొదలు కావాల్సిన కొత్త షెడ్యూల్ ఈ నెల 16 కి పోస్ట్ పోన్ అయ్యింది అనే న్యూస్ నడుస్తుంది. అయితే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అయ్యాకే మహేష్ బాబు రాజమౌళితో సినిమా మొదలు పెడతారని అందరూ అనుకుంటున్నారు. మహేష్ పూర్తిగా త్రివిక్రమ్ గుంటూరు కారం పూర్తయ్యాకే SSMB29 మొదలు పెడతారనుకుంటున్నారు.
అయితే ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే రోజున రాజమౌళి-మహేష్ బాబు SSMB29 మూవీ అఫీషియల్ గా మొదలు పెట్టొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. మహేష్-రాజమౌళి మూవీ ఆ స్పెషల్ డే రోజు అంటూ సోషల్ మీడియాలో మహేష్ ఫాన్స్ హడావిడి మొదలు పెట్టారు. మరి రాజమౌళి ఆగస్టు 9 న పూజ తో SSMB29 మొదలు పెట్టి నవంబర్, డిసెంబర్ వరకు మహేష్ కోసం వెయిట్ చేస్తారా.. లేదంటే నవంబర్ లోనే మహేష్ మూవీకి కొబ్బరి కాయ కొడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎలా కనిపిలుస్తారన్న దానిపై ఫాన్స్ లో క్రేజ్ ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఈమధ్యన మహేష్ బాబు చాలా స్టయిల్ గా కొత్తగా మేకోవర్ అయిన లుక్స్ షేర్ చేస్తుంటే.. మహేష్ ఇంత క్లాసీగా రాజమౌళి సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో.. అని మహేష్ ఫాన్స్ లో ఉబలాటం కనిపిస్తుంది.