సాహో డైరెక్టర్ సుజిత్ కి పవన్ కళ్యాణ్ OG ఓకె చెప్పడమేమిటి.. వెంటనే రంగంలోకి దిగిపోయారు. హరి హర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యన OG నలిగిపోతుంది. OG కి పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో అనుకుని అనుమానపడ్డ వాళ్ళకి షాకిస్తూ పవన్ కళ్యాణ్ ముందుగా OG షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నారు. DVV దానయ్య నిర్మిస్తోస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ రీసెంట్ గానే ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మరో పవర్ ఫుల్ నటి OG లోకి కాలు పెట్టింది.
మాజీ హీరోయిన్, విశాల్ వదిన గారు వెర్సటైల్ నటి శ్రీయ రెడ్డి OG లో నటిస్తున్నట్టుగా మేకర్స్ ఈరోజే అప్ డేట్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న OG కథని విన్న ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేసానని, ఓజి కథ ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని చెప్పడమే కాదు.. దర్శకుడు సుజీత్ అద్భుతమైన కథ తన రోల్ ని డిజైన్ చేసాడని ట్వీట్ చెయ్యడం చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇప్పుడు OG పై తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
సుజిత్ పవన్ కళ్యాణ్ డేట్స్ ని సెట్ చేసుకుని త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ కల్లా సినిమాని ఆడియన్స్ ముందుకు తేవాలని చూస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది.