Advertisementt

సమంత పారితోషకం అంత పెంచిందా?

Tue 13th Jun 2023 12:59 PM
samantha,citadel india  సమంత పారితోషకం అంత పెంచిందా?
Samantha Remuneration increased? సమంత పారితోషకం అంత పెంచిందా?
Advertisement
Ads by CJ

సమంత ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోయిన్. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో ప్యాన్ ఇండియా యాక్ట్రెస్ గా మారిన సమంత తర్వాత ఆమె చేస్తున్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్టయిల్లోనే విడుదలవుతున్నాయి. అందులో యశోద హిట్ కాగా.. శాకుంతలం డిసాస్టర్ అయ్యింది. ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ వెబ్ సీరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

అయితే సమంత ఇప్పుడు టాలీవుడ్ కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తో కూడా నటించబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈలోపులో సమంత పారితోషకం న్యూస్ ఒకటి వైరల్ అయ్యింది. మేము ఎంత కష్టపడుతున్నామో అందుకు తగ్గ పారితోషకం నిర్మాతలే చూసి ఇవ్వాలంటూ మొన్నా మధ్యన శాకుంతలం ప్రమోషన్స్ లో మాట్లాడిన సమంత ఇప్పుడు సిటాడెల్ వెబ్ సీరీస్ కోసం పది కోట్ల పారితోషకం అందుకోబోతుందట.

సమంత ఈ ప్యాన్ ఇండియా వెబ్ సీరీస్ కోసం 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. హిందీలో ప్రముఖ వెబ్ సైట్స్ లో సమంత పారితోషకంపై ప్రముఖంగా వార్తలు ప్రచురితమవడం హాట్ టాపిక్ గా మారింది. మరి గతంలో 3 నుండి 4 కోట్లు తీసుకునే సమంత ఒక్కసారిగా పది కోట్లకి చేరడం నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Samantha Remuneration increased?:

Samantha hikes her fees to Rs 10 crore for Citadel India

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ